వీబీ-జీ రాం జీ

వీబీ-జీ రాం జీ
  • 2026, జులై 1 నుంచి ప్రారంభంకానున్న వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ ఆజీవికా మిషన్‌ గ్రామీణ్‌(వీబీ-జీ రాం జీ) పథకంలో జల సంరక్షణ, గ్రామీణ జీవనోపాధి, మౌలిక వసతులు, విపత్తు నిర్వహణ కేటగిరీల్లో 318 పనులు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు 2026, జూన్‌ 18న ఆయా పనుల జాబితాను విడుదల చేసింది. 
  • ప్రస్తుతం నడుస్తున్న ఉపాధి హామీ పథకంలోనూ సహజ వనరుల నిర్వహణ, వ్యక్తిగత లబ్ధిదారుల పనులు, వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలు, గ్రామీణ మౌలిక సదుపాయాలు వంటి నాలుగు కేటగిరీల్లో 266 పనులు ఉండేవి. తాజాగా జీరాంజీలో మౌలిక సదుపాయాలు మినహా మిగతా మూడింటిని మార్చారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram