బిహార్‌కు చెందిన మూడు విలక్షణ సంప్రదాయ ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) లభించింది. నలందాకు చెందిన బావన్ బూటీ చీరలు - వస్త్రాలు, గయాజీ కళాకారుల పత్థర్‌కట్టీ శిల్పాలు, భోజ్‌పుర్ పీడియా పెయింటింగులకు ఈ ప్రత్యేక గౌరవం లభించింది. ఈ మేరకు బిహార్ నాబార్డ్ నుంచి 2026, జూన్ 13న ప్రకటన వెలువడింది.