దేశంలో చమురు నిల్వలు

దేశంలో చమురు నిల్వలు
  • పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా మన దేశం చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అయితే భారత్‌లో వ్యూహాత్మక చమురు నిల్వలు(ఎస్‌పీఆర్‌) దశాబ్దకాలంగా ఏమాత్రం పెరగలేదని వివిధ గణాంకాలు తెలియజేస్తున్నాయి. నిల్వ సామర్థ్యాన్ని రెండో దశ కింద పెద్దఎత్తున పెంచుతున్నా.. అది ఆచరణలోకి రావడానికి మరికొంత సమయం పట్టొచ్చు. 
  • ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగ దేశం మనది. దేశ ముడి చమురు అవసరాలకు దాదాపు 88% మేర దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. ఈ పరిస్థితుల్లో వ్యూహాత్మక నిల్వల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దేశంలో దశాబ్ద కాలం క్రితం 53.3 లక్షల టన్నుల (దాదాపు 3.9 కోట్ల బారెళ్లు) నిల్వ సామర్థ్యం ఉంటే.. ఇప్పుడూ అంతే ఉంది. ఇక రోజువారీ వినియోగ నిల్వలు 2.5 కోట్ల బ్యారెళ్ల వరకు ఉండొచ్చు. చైనా గత దశాబ్దకాలంలో భారీగా నిల్వ సామర్థ్యాన్ని పెంచుకుంది. దానివద్ద 140 కోట్ల బారెళ్ల(ఒక బ్యారెల్‌ 159 లీటర్లతో సమానం) నిల్వ సామర్థ్యం ఉంది. అమెరికాలో 41 కోట్ల బ్యారెళ్ల్లు ఎస్‌పీఆర్‌ కాగా.. మరో 41 కోట్ల బ్యారెళ్లు రిఫైనరీలు, ఫ్యాక్టరీల వద్ద ఉన్నాయి. ఆసియాలోని జపాన్‌(47 కోట్ల బ్యారెళ్లు), ద.కొరియా(22 కోట్ల బ్యారెళ్లు) లాంటి దేశాలూ గణనీయ నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram