దేశాన్ని పీడించిన నక్సలిజం అంతమైందని కేంద్రం అధికారిక ప్రకటన చేసింది. దేశంలో ఇప్పుడు నక్సల్స్ ప్రభావిత జిల్లాలేవీ లేవని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు అధికారికంగా సమాచారం పంపింది. నక్సలిజం పూర్తిగా అంతమైనా, తిరిగి అది పుట్టకుండా ఉండేందుకు కేంద్రం జిల్లాలను రెండు కేటగిరీలుగా వర్గీకరించింది.
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలతో పాటు మొత్తం 37 జిల్లాలను లెగసీ అండ్ థ్రస్ట్ జిల్లాలుగా ప్రకటించింది.