పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో 2026, జూన్ 23న జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా 66 మంది పురస్కారాలను అందుకున్నారు. సాహిత్యం, విద్యా రంగాల్లో విశేష కృషి చేసిన మలయాళ పాత్రికేయుడు పి.నారాయణన్, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్ పద్మవిభూషణ్ స్వీకరించారు. క్యాన్సర్ మహమ్మారిపై అవిశ్రాంత పోరు సాగిస్తున్న ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ అందుకున్నారు.
2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా 131 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించగా.. మే 25న నిర్వహించిన తొలి విడతలో 2 పద్మవిభూషణ్, 6 పద్మభూషణ్, 57 పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు. తాజాగా 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 57 పద్మశ్రీ అవార్డులు అందించారు.