వుల్ఫ్‌ ప్రైజ్‌

వుల్ఫ్‌ ప్రైజ్‌
  • భారత సంతతికి చెందిన సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త జైనేంద్ర కె జైన్‌ ప్రతిష్ఠాత్మక వుల్ఫ్‌ ప్రైజ్‌ను అందుకున్నారు. 2026, జూన్‌ 19న జెరూసలెంలో జరిగిన కార్యక్రమంలో ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ఇజాక్‌ హెర్జాగ్‌ ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేశారు. భౌతికశాస్త్ర విభాగంలో ఈ బహుమతిని గెల్చుకున్న తొలి భారత సంతతి పరిశోధకుడిగా జైనేంద్ర నిలిచారు. కాంపోజిట్‌ ఫెర్మియాన్లను కనుగొన్నందుకు ఆయనకు ఈ గౌరవం దక్కింది. ఈ ఆవిష్కారం వల్ల ‘ఫ్రాక్షనల్‌ క్వాంటమ్‌ హాల్‌ ఎఫెక్ట్‌’ గురించి అర్థం చేసుకోవడానికి వీలు కలిగింది. ఇది ఆధునిక క్వాంటమ్‌ భౌతికశాస్త్రాన్ని తీర్చిదిద్దుతోంది.
  • సైన్స్, కళల్లో అద్భుత విజయాలు నమోదు చేసిన శాస్త్రవేత్తలు, కళాకారులకు ఏటా వుల్ఫ్‌ ప్రైజ్‌ను బహుకరిస్తుంటారు. భౌతికశాస్త్ర విభాగంలో ఈ పురస్కారాన్ని అందుకున్న వారిలో 27 మంది.. ఆ తర్వాత నోబెల్‌ బహుమతిని గెల్చుకున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram