ప్రముఖ నేత్ర వైద్యులు, ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి ఎన్ రావు ప్రతిష్ఠాత్మక సంతోక్‌బా హ్యుమానిటేరియన్ అవార్డు-2026ను అందుకున్నారు. ఇటీవల గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన కార్యక్రమంలో శ్రీరామకృష్ణ(ఎస్‌ఆర్‌కే) నాలెడ్జ్ ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని బహూకరించింది.
శ్రీరామకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ సామాజిక సేవా విభాగానికి చెందిన శ్రీరామకృష్ణ నాలెడ్జ్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ గోవింద్ ఢోలకియా 2006లో తన మాతృమూర్తి సంతోక్‌బా పేరిట ఈ అవార్డును ప్రారంభించారు.