భారత సంతతికి చెందిన ప్రముఖ జీర్ణకోశ వైద్య నిపుణురాలు, మహిళల ఆరోగ్య సంరక్షణ, హక్కుల పరిరక్షకురాలైన డేమ్ పర్వీన్ కుమార్‌కు (80) బ్రిటన్‌లో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ వైద్య విద్య, ఆరోగ్య రంగానికి చేసిన సేవలకుగానూ బ్రిటన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక రాజ పురస్కారాల్లో ఒకటైన ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్’ను 2026, జూన్ 13న జరిగిన కింగ్ ఛార్లెస్- 3 అధికారిక పుట్టిన రోజు వేడుకల్లో ఆమెకు ప్రదానం చేశారు.