రామజన్మభూమి అయోధ్యలో ప్రపంచంలోనే మొట్టమొదటి మైనపు రామాయణ మ్యూజియం రూపుదిద్దుకుంది. ఇందులో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడు సహా రామాయణంలోని 50 కీలక పాత్రలను జీవకళ ఉట్టిపడేలా మైనంతో తీర్చిదిద్దారు. రాముడి జననం నుంచి రావణుడి సంహారం వరకు ప్రతీ ముఖ్య ఘట్టాన్ని కళ్లకు కట్టేలా మ్యూజియాన్ని సిద్ధం చేశారు. దీపావళిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న దీపోత్సవంలో భాగంగా అక్టోబరు 19న ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీన్ని ప్రారంభించనున్నారు.