చైనా

చైనా
  • ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పవన విద్యుత్తుతో నడిచే డేటా సెంటర్‌ను చైనా నీటి అడుగున ఏర్పాటుచేసింది. షాంఘై తీరంలోని ఈ డేటాసెంటర్‌ భూమిపై ఉన్న డేటాసెంటర్లతో పోలిస్తే అయిదోవంతు తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. నీటి వినియోగం అత్యల్పం. 2026 మే నెలలో ప్రారంభమైన షాంఘై లింగాంగ్‌ సముద్రగర్భ డేటాసెంటర్‌ ప్రాజెక్టు 24 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రభుత్వ యాజమాన్యంలోని చైనా కమ్యూనికేషన్స్‌ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ, హైక్లౌడ్‌ టెక్నాలజీలు సంయుక్తంగా దీన్ని ఏర్పాటుచేశాయి.
  • షాంఘై తీరానికి 6 మైళ్ల(10 కిలోమీటర్ల) కంటే ఎక్కువ దూరంలో ఉన్న ఈ డేటాసెంటర్, సముద్ర నీటి ఉపరితలానికి 10 మీటర్ల లోతులో మునిగి ఉంది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram