రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)గా సోనాలీ సేన్ గుప్తా నియమితులయ్యారు. ఇంతవరకు ఆర్‌బీఐ బెంగళూరు కార్యాలయంలో, కర్ణాటక రీజనల్ డైరెక్టర్‌గా ఆమె వ్యవహరించారు. ఆర్‌బీఐలోనే ఆమెకు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, మానవ వనరుల నిర్వహణ, బ్యాంకింగ్ నియంత్రణ-పర్యవేక్షణ విభాగాల్లోనూ ఆమె కీలక బాధ్యతలు నిర్వర్తించారు.