పారా అథ్లెట్ శీతల్ దేవి వైకల్యం లేని, సాధారణ ఆర్చర్లతో కలిసి ఆసియా కప్‌లో పోటీ పడేందుకు అర్హత సాధించింది. త్వరలో జెడ్డా వేదికగా జరిగే ఆసియా కప్ స్టేజ్-3లో పోటీ పడే భారత జట్టులో ఆమె చోటు సంపాదించింది. జాతీయ సెలక్షన్స్ ట్రయల్స్ మహిళల విభాగంలో ఓవరాల్‌గా 3వ స్థానంతో శీతల్.. ఆసియా కప్‌నకు ఎంపికైంది. సాధారణ ఆర్చర్లతో కూడిన భారత జట్టులో ఇలా పారా ప్లేయర్ చోటు సంపాదించడం ఇదే తొలిసారి.
రెండు చేతులూ లేకపోయినా ఆర్చరీలో అద్భుత నైపుణ్యం సంపాదించి పారా క్రీడల్లో ప్రపంచ స్థాయికి ఎదిగింది శీతల్ దేవి.