సౌవిక్‌ ఘోష్‌

సౌవిక్‌ ఘోష్‌

ఫోర్బ్స్‌ ‘30 ఆసియా అండర్‌ 30’ జాబితాలో ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌ విద్యార్థి సౌవిక్‌ ఘోష్‌ ప్రారంభించిన అంకుర సంస్థ ‘కాగ్నిటీ’ చోటు దక్కించుకుంది. ప్రత్యేక అవసరాల విద్యార్థులకు ఏఐ సహకారంతో ఈ సంస్థ పాఠాలు చెబుతోంది. కోల్‌కతాకు చెందిన సౌవిక్‌ ఘోష్, జె.త్రిశాల్, ఫల్గుణి శ్రీవాత్సవలు మూడేళ్ల క్రితం ఈ సంస్థను ఆరంభించారు. బుద్ధిమాంద్యం, మానసిక వైకల్యం, ఆటిజంతో బాధ పడుతున్న చిన్నారుల కోసం ఈ అంకుర సంస్థ ప్రారంభించిన ఏడాది లోపే... ఐరోపాకు చెందిన బైసిస్టర్‌ కలెక్షన్‌ అనే దాతృత్వ సంస్థ నుంచి లక్ష డాలర్ల బహుమతి గెలుచుకుంది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram