యాంటీ సబ్‌మెరైన్ యుద్ధనౌక ‘మాహే’ను భారత నౌకాదళానికి 2025, అక్టోబరు 23న కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (సీఎస్‌ఎల్) అందజేసింది. దేశీయంగా సీఎస్‌ఎల్ నిర్మిస్తున్న ఎనిమిది యాంటీ సబ్‌మెరైన్ వార్ ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్స్‌లో ఇది మొదటి నౌక. దీని పొడవు 78 మీటర్లు. డీజిల్ ఇంజిన్, వాటర్ జెట్ కాంబినేషన్‌తో నడిచే అతి పెద్ద నౌకిది. సముద్రపు జలాల అడుగున నిఘా కోసం దీన్ని రూపొందించారు.