క్రూజ్‌ క్షిపణి పరీక్ష

క్రూజ్‌ క్షిపణి పరీక్ష
  • భూతల లక్ష్యాలపై దాడి చేసే దీర్ఘశ్రేణి క్రూజ్‌ క్షిపణి (ఎల్‌ఆర్‌ఎల్‌ఏసీఎం) పరీక్షను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరానికి చేరువలోని ఏపీజే అబ్దుల్‌ కలాం దీవి నుంచి 2026, జూన్‌ 15న ఈ ప్రయోగం జరిగింది. ప్రయోగానికి సంబంధించిన అన్ని లక్ష్యాలూ నెరవేరాయని రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 
  • తక్కువ ఎత్తులో పయనిస్తూ ప్రత్యర్థి రాడార్ల కంటపడకుండా తప్పించుకోవడం దీని ప్రత్యేకత. 
  • బెంగళూరులో డీఆర్‌డీవో ల్యాబ్‌.. ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఏఆర్‌డీఈ) దీన్ని అభివృద్ధి చేసింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram