రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్ధ (డీఆర్‌డీవో), భారత నౌకాదళం (ఐఎన్) కలిసి బంగాళాఖాతంలో ఒడిశా తీరం వెంట నేవల్ యాంటీషిప్ మిసైల్ షార్ట్ రేంజ్ ప్రయోగం విజయవంతమైందని నేవీ వర్గాలు 2026, ఏప్రిల్ 29న తెలిపాయి. రెండు క్షిపణులను నౌకాదళానికి చెందిన హెలికాప్టర్ నుంచి జారవిడిచి ప్రయోగించారు.