భూకంపం కారణంగా అతలాకుతలమైన వెనెజువెలాలో సహాయక చర్యలు చేపట్టేందుకు భారత్ 2026, జూన్ 26న ‘ఆపరేషన్ అమిస్తాద్’ చేపట్టింది. ఆ దేశానికి రెండు వాయుసేన విమానాల్లో సహాయక సామగ్రితో పాటు వైద్యబృందాన్ని పంపింది. అక్కడ భవనాలు కూలిపోవడంతో రాజధాని కారకస్ నగరం, లా గువేరా రాష్ట్రం సహా పలు ప్రాంతాలు శిథిలాల దిబ్బలుగా మారాయి. భూకంపాల తీవ్రతకు ఇప్పటివరకూ 920 మంది మృతి చెందినట్లు నిర్ధారణ కాగా.. 3,360 మంది గాయపడ్డారు. దాదాపు మరో 50 వేల మంది జాడ ఇంకా తెలియరాలేదు.
ప్రపంచ దేశాల బాసట
వెనెజువెలాను ఆదుకునేందుకు 150 మిలియన్ డాలర్ల విలువైన సహాయక సామగ్రిని అందిస్తామని అమెరికా ప్రకటించింది.