లాటిన్ అమెరికా దేశం వెనెజువెలాలో ఒకదాని వెంట మరొకటి రెండు భారీ భూకంపాలు సంభవించాయి. ఈ శతాబ్దంలోనే ఎన్నడూలేనంత స్థాయిలో రిక్టర్ స్కేల్‌పై 7.2, 7.5 తీవ్రత నమోదైంది. 188 మంది మరణించగా, మరో 1,500 మంది గాయపడ్డారు. తొలుత రాజధాని కారకాస్‌కు పశ్చిమాన 170 కిలోమీటర్ల దూరంలోని పశ్చిమ మోరాన్ తీరంలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఒక నిమిషం తర్వాత.. మోరాన్ వాయవ్య ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూమి కంపించింది.
రాజధాని కారకాస్‌లోని సైమన్ బొలీవర్ అంతర్జాతీయ విమానాశ్రయం తీవ్రంగా దెబ్బతినడంతో దానిని మూసివేశారు.