సోషల్‌ మీడియాపై నిషేధం

సోషల్‌ మీడియాపై నిషేధం
  • పదహారేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల సోషల్‌ మీడియా వాడకంపై బ్రిటన్‌ నిషేధం విధించింది. బాలల భద్రత, సంతోషం కోసమే ఈ చర్య తీసుకున్నట్టు బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ 2026, జూన్‌ 15న వెల్లడించారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు వేలాది మంది తల్లిదండ్రులతో ప్రభుత్వం విస్తృతంగా సంప్రదింపులు జరిపిందని స్టార్మర్‌ తెలిపారు.
  • ముఖ్యంగా టిక్‌టాక్, స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ వంటి వేదికల వల్ల పిల్లలు ప్రతికూల సమాచార ప్రభావానికి గురవుతున్నారని అనేకమంది ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram