ఎలక్ట్రో-ఆప్టికల్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించిన పాక్‌

ఎలక్ట్రో-ఆప్టికల్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించిన పాక్‌

పాకిస్థాన్‌ 2026, ఏప్రిల్‌ 25న స్వదేశీ ఎలక్ట్రో-ఆప్టికల్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దీన్ని చైనాలోని తైయువాన్‌ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి పంపింది. రిమోట్‌ సెన్సింగ్‌ సామర్థ్యాల పెంపు దిశగా ఇదో ముందడుగని పాక్‌ పేర్కొంది. ఈ ఉపగ్రహానికి ఈవో-3 అని పేరు పెట్టారు. ఇందులో చిత్రీకరణ సామర్థ్యంతోపాటు కొత్తతరం అంతరిక్ష పరిజ్ఞానాలను పరీక్షించేందుకు ఉద్దేశించిన పేలోడ్‌లు కూడా ఉన్నాయి. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram