తెలంగాణలో అడవులు

తెలంగాణలో అడవులు
  • తెలంగాణలో మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 24.05 శాతం అటవీ ప్రాంతం ఉన్నట్లు రాష్ట్ర అటవీశాఖ రాష్ట్ర నివేదిక పేర్కొంది. రాష్ట్రం మొత్తం భౌగోళిక విస్తీర్ణం 1,12,122 చ.కి.మీ. కాగా అందులో అటవీ ప్రాంతం 27,688 చ.కి.మీ. విస్తీర్ణంపరంగా పచ్చదనం అత్యధికంగా ఉన్న జిల్లా భద్రాద్రి-కొత్తగూడెం(4,311.38 చ.కి.మీ). అత్యల్పంగా ఉన్న జిల్లా హైదరాబాద్‌(1.45 చ.కి.మీ.). 
  • ములుగు జిల్లాలో ఏకంగా 71.82 శాతం భూభాగం అటవీ ప్రాంతంగా ఉండగా, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో 60.95 శాతం అడవులు ఉన్నాయి. కరీంనగర్, గద్వాల, హైదరాబాద్‌ జిల్లాల్లో మొత్తం విస్తీర్ణంలో ఒక శాతం కూడా అటవీ ప్రాంతం లేదని నివేదిక వెల్లడించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram