హైదరాబాద్‌ మెట్రో తెలంగాణ ప్రభుత్వపరం

హైదరాబాద్‌ మెట్రో తెలంగాణ ప్రభుత్వపరం
  • హైదరాబాద్‌ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్ట్‌ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వపరమైంది. ఇన్నాళ్లూ ప్రైవేటు సంస్థ ఎల్‌అండ్‌టీ అధీనంలో ఉండగా రూ.1,461.47 కోట్లతో వందశాతం ఈక్విటీని కొనుగోలు చేయడం ద్వారా మెట్రోని  ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 2026, ఏప్రిల్‌ 29న సచివాలయంలో జరిగిన సమావేశంలో హెచ్‌ఎంఆర్‌ఎల్, ఎల్‌అండ్‌టీ, ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్‌ మధ్య షేర్ల కొనుగోలు ఒప్పందం కుదిరింది.
  • ఒప్పందం ప్రకారం ఎల్‌అండ్‌టీ హామీతో ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్‌పై ఉన్న రూ.13,538.53 కోట్ల అప్పును(2026 ఏప్రిల్‌ 30వ తేదీ నాటికి) తెలంగాణ ప్రభుత్వ హామీతో రీఫైనాన్స్‌ చేస్తారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram