జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-2026 

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-2026 

దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో బీటెక్‌/ బీఆర్క్‌ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ మెయిన్‌-2026 తొలి విడత పరీక్షల నోటిఫికేషన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసింది. దీని ద్వారా ఎన్‌ఐటీ, ఐఐటీ, జీఎఫ్‌టీఐ వంటి ప్రతిష్టాత్మక ఇంజినిరింగ్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్ ఇన్‌స్టిట్యూట్లలో ప్రవేశాలు పొందవచ్చు. 

వివరాలు:

* జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-2026

పేపర్‌ 1: బీఈ/బీటెక్‌

పేపర్‌ 2: బీఆర్క్‌ (బ్యాచిలర్‌ ఆఫ్‌ అర్కిటెక్చర్‌)

పేపర్‌ 3: బీ ప్లానింగ్‌ (బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌)

అర్హత:

అభ్యర్థులకు వయోపరిమితి లేదు. 2024, 2025లో 12వ తరగతి/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు లేదా 2026లో వయసుతో సంబంధం లేకుండా 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు జేఈఈ (మెయిన్)-2026 పరీక్షకు హాజరు కావచ్చు. ప్రధాన సబ్జెక్టులు: గణితం, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ తప్పనిసరి.

జేఈఈ మెయిన్‌ పరీక్ష వివరాలు:

* దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో బీటెక్‌ సీట్లను జేఈఈ మెయిన్‌ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. ఐఐటీల్లో బీటెక్‌లో చేరాలంటే మెయిన్‌లో ఉత్తీర్ణులైన వారు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయాలి. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించి అర్హత పొందిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అర్హత ఉంటుంది. జేఈఈ మెయిన్‌ ర్యాంకుల ఆధారంగా కొన్ని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలు యాజమాన్య కోటా సీట్లను కేటాయిస్తాయి. దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో, జీఎఫ్‌టీఐల్లో 25,000+ సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

పరీక్ష విధానం:

* బీఆర్క్, బీ ప్లానింగ్‌లో ప్రవేశించేందుకు పేపర్‌-2, బీటెక్‌ సీట్ల భర్తీకి పేపర్‌-1 పరీక్ష జరుపుతారు. పరీక్ష కంప్యూటర్‌ ఆధారిత విధానంలో జరుగుతుంది.

పేపర్‌ 1- బీఈ/బీటెక్‌; సబ్జెక్టులు: గణితం, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ; ప్రశ్నలు- 90, మార్కులు 300, 3 గంటల వ్యవధిలో ఉంటుంది.

పేపర్‌ 2ఏ- బీఆర్క్‌ (ఆర్కిటెక్చర్‌): సబ్జెక్టులు- గణితం, ఆప్టీట్యూడ్‌, డ్రాయింగ్‌; మార్కులు 400; వ్యవధి 3 గంటలు.

పేపర్‌ 2బి- బీప్లానింగ్‌: సబ్జెక్టులు- గణితం, ఆప్టీట్యూడ్‌, ప్లానింగ్‌ ఆధారిత ప్రశ్నలు, మార్కులు 400; వ్యవధి 3 గంటలు.

* రెండు సెక్షన్లలో మైనస్‌ మార్కులుంటాయి. సరైన సమాధానానికి 4 మార్కులు, తప్పు అయితే మైనస్‌ 1 ఇస్తారు.

* ఈ పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తారు.

* పరీక్షలను తెలుగు, ఆంగ్లం సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆంగ్లంతో పాటు అభ్యర్థులు కోరుకున్న ప్రాంతీయ భాషలో కూడా ఇస్తారు.

* దరఖాస్తులో ఫోటో, సంతకం క్లియర్‌గా అప్లోడ్‌ చేయాలి. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు…

తెలంగాణ:

హైదరాబాద్‌/సికింద్రాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, నల్గొండ, వరంగల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిద్దిపేట, సూర్యాపేట, ఆదిలాబాద్‌, కోదాడ, పెద్దపల్లి.

ఏపీ: 

అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, పొద్దుటూరు, సూరంపాలెం, మచిలీపట్నం, నంద్యాల, తాడేపల్లిగూడెం, అదోని, అమలాపురం, మదనపల్లి, మర్కాపుర్‌, పుత్తూరు, రాయచోటీ, తాడిపత్రి, తిరుపతి.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ పురుషులు రూ.1000, మహిళలకు రూ.800; ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ పురుషులకు రూ.900; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.500.

పరీక్షల షెడ్యూల్‌...

తొలి విడత                                    

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: అక్టోబర్‌ 31 నుంచి నవంబరు 27 వరకు.

హాల్‌టికెట్లు: పరీక్షకు 3రోజుల ముందు.

పరీక్షలు: జనవరి 21 నుంచి 30 మధ్య.        

ఫలితాలు: ఫిబ్రవరి 12 నాటికి.    

రెండో విడత

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జనవరి చివరి వారంలో

పరీక్షలు: ఏప్రిల్‌ 2 - 9 మధ్య.

ఫలితాలు: ఏప్రిల్‌ 20 నాటికి.

Website:https://jeemain.nta.nic.in/

 

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram