ట్రిపుల్‌ఐటీ-ఏపీలో పీయూసీ, బీటెక్‌ ప్రోగ్రామ్ 

ట్రిపుల్‌ఐటీ-ఏపీలో పీయూసీ, బీటెక్‌ ప్రోగ్రామ్ 

ఏపీలోని రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) నిర్వహిస్తున్న నాలుగు ట్రిపుల్‌ఐటీ (ఆర్‌కే వ్యాలీ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు) క్యాంపస్‌లలో ఆరేళ్ల సమీకృత బీటెక్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల ప్రవేశాల ప్రకటన విడుదలైంది.

వివరాలు:

మొత్తం నాలుగు క్యాంపస్‌లలో 4,400 సీట్లు భర్తీ కానున్నాయి. ప్రతి క్యాంపస్‌కు 1,100 సీట్లు కేటాయించారు. 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద అదనంగా సీట్లు  భర్తీ చేస్తారు. 

అర్హతలు: అభ్యర్థులు 2026 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా సీబీఎస్‌ఈ/ఐసీఎస్‌ఈ ద్వారా నిర్వహించిన 10వ తరగతి (SSC) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: నోటిఫికేషన్ ప్రకారం, 2026లో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మార్కుల విషయంలో ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీ (tie) ఏర్పడితే, వయసులో పెద్దవారైన అభ్యర్థికి ప్రాధాన్యత ఉంటుంది.

కోర్సు విభాగాలు:

ప్రి-యూనివర్శిటీ కోర్స్ (PUC): M.P.C., M.Bi.P.C. విభాగాలు (6 సంవత్సరాలు).  

ఇంజినీరింగ్ బ్రాంచీలు (B.Tech): 4 సంవత్సరాలు

  • కెమికల్ ఇంజినీరింగ్ (నూజివీడు, ఆర్.కె వ్యాలీలో మాత్రమే).  
  • సివిల్ ఇంజినీరింగ్.  
  • కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్.
  • కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విత్‌ ఏఐ అండ్‌ ఎంఎల్‌.
  • ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్.  
  • ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్.  
  • మెకానికల్ ఇంజినీరింగ్.  
  • మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్ (నూజివీడు, ఆర్.కె వ్యాలీలో మాత్రమే)

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.250, ఇతరులకు రూ.400.

  • ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ విద్యార్థులకు 4% 'డిప్రివేషన్ స్కోర్' అదనంగా కలుపుతారు.
  • పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్‌ నియమావళి అనుసరించి సీట్లు కేటాయిస్తారు. ఆర్జీయూకేటీ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఆమోదించిన ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో విద్యార్థులు సాధించిన మార్కులకు 4 శాతం మార్కులు కలుపుతారు. రెండేళ్ల పీయూసీ అనంతరం విద్యార్థులకు బయటకు వెళ్లే వెసులుబాటు కల్పిస్తారు.
  • అభ్యర్థుల మెరిట్‌ ఆధారంగా కేటగిరీ ప్రకారం ప్రాధాన్య క్రమంలో క్యాంపస్‌లను కేటాయిస్తారు. అందువల్ల అభ్యర్థులు తమ క్యాంపస్‌ ప్రాధాన్యాలను జాగ్రత్తగా సూచించాలి. ఒకసారి క్యాంపస్‌ నిర్ధారణ జరిగిన తర్వాత బదిలీకి అవకాశం ఉండదు. విద్యార్థులు ప్రవేశం పొందిన క్యాంపస్‌లోనే చదవాల్సి ఉంటుంది.

ముఖ్య తేదీలు:

నోటిఫికేషన్‌ విడుదల: 01-05-2026.

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 01-05-2026.

ఆఖరు తేదీ: 30.05.2026 సాయంత్రం 5 గంటల వరకు

ప్రత్యేక క్యాటగిరీ అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన ఆర్జీయూకేటీ నూజివీడు ప్రాంగణంలో తేదీల వారీగా..

సీఏపీ: 05-06-2026 నుంచి 08-06-2026 వరకు .

క్రీడలు: 05-06-2026 నుంచి 08-06-2026 వరకు.

భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌: 08-06-2026.

ఎన్‌సీసీ: 05-06-2026 నుంచి 08-06-2026 వరకు.

తాత్కాలిక ఫలితాల ప్రకటన: 12-06-2026.

ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన..

నూజివీడు ప్రాంగణం: 19-06-2026, 20-06-2026.

ఆర్కే వ్యాలీ (ఇడుపుల పాయ): జూన్‌ 19, 20 తేదీల్లో

ఒంగోలు ప్రాంగణం: జూన్‌ 22, 23 తేదీల్లో (ఇడుపులపాయ)

శ్రీకాకుళం ప్రాంగణం: జూన్‌ 22, 23 తేదీల్లో .

Website: https://www.rgukt.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram