ఐసీఎమ్‌ఆర్‌-ఎన్‌ఐటీవీఏఆర్‌ పుణెలో కన్సల్టెంట్ పోస్టులు

ఐసీఎమ్‌ఆర్‌-ఎన్‌ఐటీవీఏఆర్‌ పుణెలో కన్సల్టెంట్ పోస్టులు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్‌లేషనల్ వైరాలజీ అండ్ ఎయిడ్స్ రిసెర్చ్ (ఎన్‌ఐటీవీఏఆర్‌), పుణె కాంట్రాక్ట్ ప్రాతిపదికన కన్సల్టెంట్ (మెడికల్) పోస్టుల భర్తీకి వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టులు: 5

వివరాలు:

1. కన్సల్టెంట్ (మెడికల్) -02

2. కన్సల్టెంట్ (మెడికల్) -01

3. కన్సల్టెంట్ (నాన్-మెడికల్) (స్టాటిస్టిక్) -01

4. ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్ I (మెడికల్) -01

అర్హత: ఎంబీబీఎస్‌/బీడీఎస్‌/ఎంఎస్సీ/పీజీ డిప్లొమాతో పాటు సంబంధిత ఉద్యోగానుభవం ఉండాలి. 

గరిష్ఠ వయోపరిమితి: ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్ I - 35 ఏళ్లు; ఇతర పోస్టులకు 40 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండాలి. 

జీతం: నెలకు ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్ I - రూ. 67,000, ఇతర పోస్టులకు రూ.60,000 నుంచి రూ.1,50,000 వరకు ఉంటాయి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.(అభ్యర్థుల సంఖ్య 30 కంటే ఎక్కువ ఉంటే రాత పరీక్ష నిర్వహిస్తారు).

ఇంటర్వ్యూ తేదీ: 30-06-2026.

వేదిక: ఆడిటోరియం, ఐసీఎమ్‌ఆర్‌-ఎన్‌ఐటీవీఏఆర్‌, ప్లాట్ నంబర్ 73, జి-బ్లాక్, భోసరి, పుణె -411026.

Website:https://www.icmr.gov.in/employment-opportunities?archive=1&page=115

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram