ఆర్‌ఐఈలో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు

ఆర్‌ఐఈలో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎన్‌సీఈఆర్‌టీ నెల్లూరులోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్‌ఐఈ) ఒప్రంద ప్రాతిపదికన నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.  

మొత్తం పోస్టులు: 05

వివరాలు:

1. కంప్యూటర్ ప్రోగ్రామర్ - 01

2. గ్రాఫిక్ డిజైనర్ - 01

3. జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో (జేపీఎఫ్‌) -02

4. కంప్యూటర్ టైపిస్ట్ (తెలుగు) - 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ/బీఈ/బీటెక్‌, ఎం.ఈడీ/పీజీ,  ఉత్తీర్ణతతో పాటు స్పీడ్‌ టైపింగ్‌, కంప్యూటర్‌ పరిజ్ఞానం, రెండు నుంచి నాలుగేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. 

గరిష్ఠ వయోపరిమితి: పోస్టును బట్టి 40 నుంచి 65 ఏళ్ల వరకు ఉండాలి.

జీతం: పోస్టును బట్టి నెలకు రూ.22,000 నుంచి రూ.50,000 వరకు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. 

ఇంటర్వ్యూ తేదీ: 30.06.2026.

వేదిక: ఇంటర్వ్యూలు రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (RIE), నెల్లూరు ఆధ్వర్యంలో జరుగుతాయి.

Website:https://ncert.nic.in/vacancies.php?ln=en

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram