హైదరాబాద్‌ ఐఐసీటీలో ఉద్యోగాలు

హైదరాబాద్‌ ఐఐసీటీలో ఉద్యోగాలు

సీఎస్‌ఐఆర్‌-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ( ఐఐసీటీ) హైదరాబాద్ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 27

వివరాలు:

1. రిసెర్చ్‌ అసోసియేట్‌: 01

2. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌: 01 

3. ప్రాజెక్టు అసోసియేట్‌-2: 09

4. ప్రాజెక్టు అసోసియేట్‌-1: 14

5. ప్రాజెక్ట్ అసిస్టెంట్‌-2: 02

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ, ఎంటెక్‌, బీటెక్‌, ఎంఫార్మసీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 35 నుంచి 40 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-1, 2కు రూ.25,000 - రూ.28,000, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌-2కు రూ.20,000, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.42,000, రిసెర్చ్‌ అసోసియేట్‌కు రూ.58,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 2026 మే 5, 6.

వేదిక: సీఎస్‌ఐఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదారబాద్‌-500007.

Website:https://www.iict.res.in/CAREERS

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram