న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో అప్రెంటిస్‌ పోస్టులు

న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో అప్రెంటిస్‌ పోస్టులు

న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఐఏసీఎల్‌) దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐఏసీఎల్‌ శాఖల్లో అప్రెంటిస్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  

మొత్తం పోస్టులు: 550

(తెలంగాణ- 18, ఆంధ్రప్రదేశ్‌- 17 ఉన్నాయి)

వివరాలు:

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైన విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతలు ఉత్తీర్ణులై ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.12,300.

వయోపరిమితి: 01.06.2026 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు,  దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌(పురుషులు) అభ్యర్థులకు రూ.944; మహిళలు రూ.708; ఎస్సీ/ ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.236.

ఎంపిక ప్రక్రియ: అబ్జెక్టివ్‌ టైప్‌ ఆన్‌లైన్‌ పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. స్థానిక భాషా పరిజ్ఞానం ఉండాలి.

పరీక్ష విధానం: జనరల్‌/ ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌, జనరల్‌ ఇంగ్లిష్‌, క్వాంటిటేటివ్‌ అండ్‌ రిజనింగ్‌ ఆప్టిట్యూడ్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ నుంచి 25 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు 60 నిమిషాల వ్యవధిలో పరీక్ష ఉంటుంది.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు NATS పోర్టల్ https://nats.education.gov.in/ లో నమోదు చేసుకోవాలి.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 23-06-2026.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06.07.2026.

ఆన్‌లైన్ పరీక్ష (ఆబ్జెక్టివ్) తేదీ: 12.07.2026.

Website:https://www.newindia.co.in/portal/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram