ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ (ఐఎస్‌టీఆర్‌ఏసీ), బెంగళూరు 2026-27 సంవత్సరానికి గ్రాడ్యుయేట్‌, డిప్లొమా, ట్రేడ్‌ అప్రెంటిస్‌ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 96 

వివరాలు:

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రెయినీ (Graduate Apprentice): 63

కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ & అనుబంధ విభాగాలు- 23 

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌- 28 

ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌- 4 

మెకానికల్‌ ఇంజినీరింగ్‌- 4 

సివిల్‌ ఇంజినీరింగ్‌- 1 

బీఎస్సీ (CS/IT)- 1 

లైబ్రరీ సైన్స్‌- 2 

డిప్లొమా అప్రెంటిస్‌ ట్రెయినీ (Diploma Apprentice): 25

మెకానికల్‌ ఇంజినీరింగ్‌- 3 

ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌- 3 

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌- 6 

సివిల్‌ ఇంజినీరింగ్‌- 1 

కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌- 7 

కమర్షియల్‌ ప్రాక్టీస్‌- 5 

ట్రేడ్‌ అప్రెంటిస్‌ (ITI): 8

ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌- 4 పోస్టులు

మెషినిస్ట్‌- 1 పోస్టు

ఎలక్ట్రికల్‌- 1 పోస్టు

ఐటీ-టీఎస్‌ఎం- 1 పోస్టు

ఫిట్టర్‌- 1 పోస్టు

అర్హత: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌ పూర్తి చేసి ఉండాలి. డిప్లొమా పోస్టులకు సంబంధిత ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉండాలి. ఐటీఐ పోస్టులకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత అవసరం. 2024, 2025, 2026 సంవత్సరాల్లో కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. అభ్యర్థులు తప్పనిసరిగా NATS పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి.

స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.12,300, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.10,900, ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌కు రూ.9,600.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు దరఖాస్తులను ఈమెయిల్‌ ద్వారా పంపాలి. ఈమెయిల్‌ సబ్జెక్ట్‌లో సంబంధిత పోస్టు కోడ్‌ తప్పనిసరిగా పేర్కొనాలి. ఈమెయిల్‌లో పేరు, మొబైల్‌ నంబర్‌, విద్యార్హత వివరాలు, ఉత్తీర్ణత సంవత్సరం, ఎన్‌ఏటీఎస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ ఇవ్వాలి. 

ఎంపిక విధానం: దరఖాస్తుల పరిశీలన అనంతరం షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులను డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, ఇంటర్వ్యూకు పిలుస్తారు. డిగ్రీ/డిప్లొమా/ఐటీఐ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జాబితా రూపొందిస్తారు.

ఈమెయిల్‌ చిరునామాలు: 

బెంగళూరు:apprmt_blr@istrac.gov.in

లఖ్‌నవూ: apprmt_lko@istrac.gov.in

శ్రీ విజయ పురం:apprmt_ixz@istrac.gov.in

పరీక్ష / ఇంటర్వ్యూ కేంద్రాలు:

ఐఎస్‌టీఆర్‌సీ లఖ్‌నవూ: ఆగస్టు 27, 28.

ఐఎస్‌టీఆర్‌సీ శ్రీ విజయ పురం: సెప్టెంబర్‌ 3, 4 తేదీల్లో.

ఐఎస్‌టీఆర్‌సీ బెంగళూరు: సెప్టెంబర్‌  9 నుంచి 11 తేదీల్లో.

దరఖాస్తు చివరి తేదీ: 31.07.2026.

Website:https://www.isro.gov.in/ISTRACRecruitment3.html

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram