యూనియన్ బ్యాంకులో అప్రెంటిస్ పోస్టులు

యూనియన్ బ్యాంకులో  అప్రెంటిస్ పోస్టులు

ముంబయిలోని మానవ వనరుల శాఖ, సెంట్రల్ ఆఫీస్- దేశవ్యాప్తంగా యూబీఐ శాఖల్లో అప్రెంటిస్‌షిప్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

అప్రెంటిస్‌షిప్‌: 1,865 ఖాళీలు (యూఆర్‌- 823, ఎస్సీ- 289, ఎస్టీ- 131, ఓబీసీ- 447, ఈడబ్ల్యూఎస్‌- 175)

తెలంగాణలో 164, ఆంధ్రప్రదేశ్‌లో 303 ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) పూర్తి చేసి ఉండాలి. 01 ఏప్రిల్ 2026 నాటికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకునే రాష్ట్ర స్థానిక భాషలో మాట్లాడటం, రాయడం, చదవడంలో నైపుణ్యం కలిగి ఉండాలి.

శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.

స్టైపెండ్: బ్రాంచ్ ఉన్న ప్రాంతాన్ని బట్టి నెలకు స్టైపెండ్ ఈ క్రింది విధంగా ఉంటుంది:

రూరల్ / సెమీ-అర్బన్: రూ.15,000.

అర్బన్: రూ.18,000.

మెట్రో: రూ.20,000.

వయోపరిమితి: 01.04.2026 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10-15 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ & రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రొడక్ట్స్‌ అండ్‌ సర్విసెస్‌ అంశాలపై ఉంటుంది. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.

స్థానిక భాషా పరీక్ష: ఆన్‌లైన్ పరీక్షలో అర్హత సాధించిన వారికి స్థానిక భాషా నైపుణ్యాన్ని పరీక్షిస్తారు.

ఆన్‌లైన్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్) సబ్జెక్టులు: జనరల్/ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ (20 ప్రశ్నలు- 20 మార్కులు), జనరల్ ఇంగ్లిష్ (20 ప్రశ్నలు- 20 మార్కులు), క్వాంటిటేటివ్ అండ్‌ రీజనింగ్ ఆప్టిట్యూడ్ (20 ప్రశ్నలు- 20 మార్కులు), కంప్యూటర్ లేదా సబ్జెక్ట్‌ నాలెడ్జ్ (20 ప్రశ్నలు- 20 మార్కులు), యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రొడక్ట్స్‌ అండ్‌ సర్విసెస్‌ (20 ప్రశ్నలు- 20 మార్కులు).

దరఖాస్తు రుసుము: జనరల్‌/ ఓబీసీ(పురుషులకు) రూ.944. జనరల్‌/ ఓబీసీ(మహిళలకు) రూ.708, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ట్రాన్స్‌జెండర్‌ అభ్యర్థులకు రూ.236.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 29.04.2026.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19.05.2026.

ఆన్‌లైన్ పరీక్ష తేదీ: మే/జూన్ 2026 (తాత్కాలికం).

Website:https://www.unionbankofindia.bank.in/en/home

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram