ఐఆర్‌ఈఎల్‌లో అప్రెంటిస్‌ ఉద్యోగాలు

ఐఆర్‌ఈఎల్‌లో అప్రెంటిస్‌ ఉద్యోగాలు

ఇండియన్‌ రేర్‌ ఎర్త్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌ఈఎల్‌) గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌ అండ్‌ ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తికి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 38

వివరాలు:

1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌- 02

2. టెక్నీషియన్: 06

3. ట్రేడ్‌ అప్రెంటిస్‌: 07

4. ట్రేడ్‌ అప్రెంటిస్‌(ఐటీఐ): 23

విభాగాలు: ఎలక్ట్రికల్‌, సివిల్‌, మెకానికల్‌, వెల్డర్‌, కెమికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, టర్నర్‌, ప్లంబర్‌, ఫిట్టర్‌, కార్పెంటర్‌, ఏసీ మెకానిక్‌, సోలార్‌ ఎలక్ట్రీషియన్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌, డిప్లొమా, ఎంఎస్సీ/బీఎస్సీ, ఎంబీఏ, ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5ఏళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయోసడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల మార్కుల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను హెడ్‌ ఆఫ్‌ డిపార్ట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఎం, ఓఎస్‌సీఓఎం, ఐఆర్‌ఈఎల్‌ లిమిటెడ్‌, మతిఖలో, గంజాం జిల్లా ఒడిశా చిరునామాకు సంబంధిత ధ్రువపత్రాలను జత చేసి పంపించాలి.(అభ్యర్థులు సంబంధిత అప్రెంటిస్‌ పోర్టల్‌, ఎన్‌ఏటీఎస్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోని ఉండాలి).

దరఖాస్తు చివరి తేదీ: 15.05.2026.

Website:https://irel.co.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram