ఇండియన్ నేవీ ఎస్‌ఎస్‌సీ రిక్రూట్‌మెంట్‌ 2027- 275 ఉద్యోగాలు

ఇండియన్ నేవీ ఎస్‌ఎస్‌సీ రిక్రూట్‌మెంట్‌ 2027- 275 ఉద్యోగాలు

కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్‌ఏ)లో 2027, జూన్‌ నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) కోర్సులో ప్రవేశాలకు సంబంధించి వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  

మొత్తం పోస్టుల సంఖ్య: 275.

వివరాలు:

షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్- జూన్‌ 2027 కోర్సు

బ్రాంచి వివరాలు:

1. ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌: 90 పోస్టులు

2. పైలట్: 25 

3. నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్(ఎన్‌ఏఓఓ): 18 

4. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్: 15 

5. లాజిస్టిక్స్: 10

6. నావల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్ కేడర్: 14

7. ఎడ్యుకేషన్‌: 13

8. ఇంజినీరింగ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్): 24

9. ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్): 32

10. నావల్ కన్‌స్ట్రక్టర్: 18

11. సబ్‌మెరైన్‌ టెక్నికల్‌ ఎలక్ట్రికల్‌: 08

12. సబ్‌మెరైన్‌ టెక్నికల్‌ ఇంజినీరింగ్‌: 08

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఫీజీ (ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ, ఎంఎస్సీ, ఎంటెక్‌) ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. 

ప్రారంభ వేతనం: నెలకు రూ.1,20,000 ఇతర అలవెన్సులు.

వయోపరిమితి: పైలట్‌/ఎన్‌ఏఓఓ పోస్టులకు 02.07.2003 నుంచి 01.01.2008 మధ్య జన్మించి ఉండాలి. ఇతర పోస్టులకు 02.07.2002 నుంచి 01.01.2008 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 27.07.2026.

Website:https://www.joinindiannavy.gov.in/en/event/online-application-window-for-ssc-various-entries-for-jun-27-course-is-live-from-25-jun-26-to-27-jul.html

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram