స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెడికల్‌ ఆఫీసర్ పోస్టులు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెడికల్‌ ఆఫీసర్ పోస్టులు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఒప్పంద ప్రాతిపదికన  స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ (మెడికల్‌) పోస్టుల భర్తీకి  దరఖాస్తులు కోరుతోంది.  

మొత్తం పోస్టుల సంఖ్య: 35

(దీనిలో హైదరాబాద్, భువనేశ్వర్, లఖ్‌నవూ, మహారాష్ట్ర, పట్నా, చెన్నై, బెంగళూరు లాంటి వివిధ సర్కిళ్ల వారీగా భర్తీ  చేయనున్నారు).

వివరాలు:

బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ (బీఎంఓ-II) (మెడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ - II) 

అర్హతలు: పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌, పీజీ డిప్లొమాతో పాటు ఐదేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 31.05.2026 నాటికి గరిష్ఠంగా 35 ఏళ్లు ఉండాలి.

జీతం: రూ.64,820 నుంచి రూ.93,960 వరకు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా

ఎంపిక విధానం: విద్యార్హతలు, ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు చివరి తేది: 14.07.2026.

Website:https://ibpsreg.ibps.in/sbiscojun26/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram