ఏపీఎస్‌పీడీసీఎల్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు

ఏపీఎస్‌పీడీసీఎల్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు

సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ (ఏపీఎస్‌పీడీసీఎల్‌) పరిధిలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతోంది.  

మొత్తం పోస్టుల సంఖ్య - 135 

వివరాలు:

1.  అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) - 125 

2. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్  (సివిల్) - 06  

3. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (టెలికాం) - 04  

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్‌ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ టెలికమ్యూనికేషన్స్/ సివిల్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం: రెండేళ్ల ప్రొబేషన్ కాలంలో నెలకు రూ.75,000/- కన్సాలిడేటెడ్ వేతనం ఇస్తారు. ఆ తర్వాత రెగ్యులర్ టైమ్ పే-స్కేల్ రూ.86,245 - రూ. 2,08,915 వర్తిస్తుంది.  

గరిష్ఠ వయోపరిమితి: 01.07.2026 నాటికి 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్, కామన్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ నిర్వహణ ఫీజు రూ.1000.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా మాత్రమే.  

దరఖాస్తు చివరి తేదీ: 2026 జులై 20. 

Website:https://apspdcl.in/eodb.php

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram