ఏపీసీపీడీసీఎల్‌లో ఇంజినీర్‌ పోస్టులు

ఏపీసీపీడీసీఎల్‌లో ఇంజినీర్‌ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్‌) అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.  

మొత్తం పోస్టుల సంఖ్య: 60

వివరాలు: 

అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌) -56

అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (సివిల్‌) -3

అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (టెలికాం) - 1

అర్హతలు: ఏఐసీటీఈ/యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగాల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 01-07-2026 నాటికి 18 నుంచి 42 ఏళ్లు మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌లకు 47 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపుతో 52 ఏళ్లు ఉండాలి.

జీతం: ప్రొబేషన్‌ కాలంలో నెలకు రూ.75,000 అందుతుంది. ప్రొబేషన్‌ తరువాత నెలకు రూ.86,245- రూ.2,08,915.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది.

పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు ఉంటుంది. కోర్‌ సబ్జెక్టులకు 70 మార్కులు, జనరల్‌ ఇంటలీజెన్స్‌ అండ్‌ రిజనింగ్‌కు 5 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌కు 7, ఇంగ్లిష్‌ లాంగ్వేజెస్‌కు 5, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌కు 8, కంప్యూటర్‌ నాలెడ్జ్‌కు 5 మార్కుల చొప్పున కేటాయించారు. నెగెటివ్‌ మార్కులు లేవు. పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

అప్లికేషన్‌ ఫీజు: రూ.1000.

పరీక్ష కేంద్రాలు: సీబీటీ పరీక్షకు ఆంధ్రప్రదేశ్‌లోని కడప, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు పలు నగరాలతో పాటు హైదరాబాద్‌, ఖమ్మం, బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: 30-06-2026 ఉదయం 10:00 గంటల నుంచి.

దరఖాస్తు చివరి తేదీ: 20-07-2026 రాత్రి 11:59 గంటల వరకు.

Website:https://apvidyutrecruitment.apcfss.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram