ఐసీఎంఆర్ దిల్లీలో సైంటిస్ట్ పోస్టులు

ఐసీఎంఆర్ దిల్లీలో సైంటిస్ట్ పోస్టులు

దిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్‌) - సెంటర్‌ ఫర్‌ రిసెర్చ్‌ మేనేజ్‌మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ హీమోగ్లోబినోపథిస్ (సీఆర్‌ఎంసీహెచ్‌) సైంటిస్ట్ (మెడికల్‌) పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం పోస్టులు: 06

వివరాలు:

1. సైంటిస్ట్-సి (నాన్-మెడికల్)- 01

2. సైంటిస్ట్-బి (మెడికల్) -02

3. సైంటిస్ట్-బి (నాన్-మెడికల్)-03

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంబీబీఎస్‌/పీజీ/ఫార్మ్-డి/ ఉత్తీర్ణతతో పాటు నాలుగేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠవయోపరిమితి: సైటింస్ట్‌-బికు 35; సైంటిస్ట్‌-సికు 40 ఏళ్ల వరకు ఉండాలి.

జీతం: నెలకు వారి అర్హతలను బట్టి సైంటిస్ట్-సి (నాన్-మెడికల్) రూ.67,700 నుంచి రూ.2,08,700; సైంటిస్ట్-బి (మెడికల్) రూ.56,100 నుంచి రూ.1,77,500; సైంటిస్ట్-బి (నాన్-మెడికల్) రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ. 1500/. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పిడబ్ల్యూడీ, ఇడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు చివరి తేది: 10-07-2026. 

Website:https://recruitment.icmr.org.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram