సీఐఎస్‌ఎఫ్‌లో పారా మెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు

సీఐఎస్‌ఎఫ్‌లో పారా మెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌) పారా మెడికల్ స్టాఫ్ విభాగంలో తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం పోస్టులు: 24

వివరాలు:

1. ఏఎస్ఐ (ఫార్మసిస్ట్): 18

2. ఏఎస్‌ఐ (ఎక్స్-రే టెక్నీషియన్): 1 

3. ఏఎస్‌ఐ (ల్యాబ్ టెక్నీషియన్): 5 

విద్యార్హతలు: 

ఏఎస్‌ఐ (ఫార్మసిస్ట్): 10+2 ఉత్తీర్ణతతో పాటు ఫార్మసీలో డిప్లొమా/డిగ్రీ ఉండాలి. & ఫార్మసీ యాక్ట్ 1948 కింద ఫార్మసిస్ట్‌గా రిజిస్టర్ అయి ఉండాలి.  

ఏఎస్‌ఐ (ఎక్స్-రే టెక్నీషియన్): 10+2 ఉత్తీర్ణత & రేడియోగ్రఫీలో 2 ఏళ్ల డిప్లొమా ఉండాలి.  

ఏఎస్‌ఐ (ల్యాబ్ టెక్నీషియన్): సైన్స్‌తో 10+2 ఉత్తీర్ణత & మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో 2 ఏళ్ల డిప్లొమా ఉండాలి.  

వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. (కటాఫ్ తేదీ: 07/07/2026). నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది.  

జీతం: నెలకు రూ.29,200 నుంచి రూ.92,300. & ఇతర భత్యాలు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం: సీఐఎస్‌ఎఫ్‌ అధికారిక వెబ్‌సైట్ https://cisfrectt.cisf.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.  

దరఖాస్తు రుసుము: జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (OMR/CBT), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), డాక్యుమెంటేషన్, బేసిక్ వోకేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (BVAT) & వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.  

పరీక్ష విధానం: 100 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్ష ఉంటుంది. పరీక్షా సమయం రెండు గంటలు. ప్రశ్నలు హిందీ & ఇంగ్లీష్ భాషల్లో ఉంటాయి. నెగటివ్ మార్కింగ్ లేదు.  

పరీక్ష కేంద్రాలు: దరఖాస్తు సమర్పించిన ప్రాంతాల వారీగా కేటాయించిన రిక్రూట్‌మెంట్ సెక్టార్ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు.  

దరఖాస్తు ప్రారంభ తేదీ: 08/06/2026.  

చివరి తేదీ: 07/07/2026 (రాత్రి 23:59 గంటల వరకు).  

Website:https://cisfrectt.cisf.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram