తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ - జూన్‌ 2026

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ - జూన్‌ 2026

తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TGTET - JUNE 2026) నిర్వహించడానికి టెట్‌ జూన్‌ 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలో I నుంచి VIII తరగతుల ఉపాధ్యాయ నియామక పరీక్షలకు అర్హత పొందడానికి ఈ పరీక్ష తప్పనిసరి. టీచింగ్ ఉద్యోగాలకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు, ఇప్పటికే సర్వీసులో ఉన్న టీచర్లు కూడా ఈ పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలి. 

వివరాలు: 

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌- జూన్‌ 2026

దీనిలో రెండు పేపర్లు ఉంటాయి.

పేపర్-I: ప్రాథమిక పాఠశాలలలో (I-V తరగతులు) ఉపాధ్యాయులుగా పనిచేయాలనుకునే వారికి. 

పేపర్-II: ఉన్నత ప్రాథమిక పాఠశాలలలో (VI-VIII తరగతులు) ఉపాధ్యాయులుగా పనిచేయాలనుకునే వారికి. 

అర్హతలు: 

పేపర్-I (తరగతి 1 నుంచి 5): ఇంటర్మీడియట్‌లో కనీసం 50% మార్కులు (ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగులకు 45%); D.El.Ed /D.Ed (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) ఉత్తీర్ణత ఉండాలి. 

పేపర్-II (తరగతి 6 నుంచి 8): ఏదైనా డిగ్రీ కనీసం 50% మార్కులు (ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగులకు 45%)తో పాటు బీఎడ్‌/ బీఎడ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ ఉత్తీర్ణత ఉండాలి. 

భాషా పండిట్ పోస్టులకు సంబంధిత భాషా డిగ్రీ + పండిట్ ట్రైనింగ్ అవసరం. 

చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా పరీక్ష రాయవచ్చు.

గతంలో టెట్‌ ఉత్తీర్ణులైన వారు తమ స్కోరును మెరుగుపరుచుకోవడానికి మళ్ళీ రాయవచ్చు.

రెండు పేపర్లు: 1 నుంచి 8 తరగతుల వరకు బోధించాలనుకునే వారు పేపర్‌-I, పేపర్‌-II రెండింటికీ హాజరు కావాలి

వయోపరిమితి: టీజీటెట్‌ అనేది అర్హత పరీక్ష మాత్రమే. కాబట్టి ఇందులో వయో పరిమితి వర్తించదు. 

పరీక్ష విధానం: 

ప్రశ్నల సంఖ్య: 150, మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు వస్తాయి. మొత్తం మార్కులు 150. నెగటివ్ మార్కింగ్ లేదు.

ప్రశ్న పత్రం: ఇంగ్లిష్ + ఎంపిక చేసిన భాష (Language I)

పేపర్-Iలో చైల్డ్‌ డెవెలపింగ్‌, లాంగ్వేజెస్‌, మ్యాథమెటిక్స్‌ అండ్‌ ఈవీఎస్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి.

పేపర్-IIలో చైల్డ్‌ డెవెలపింగ్‌, లాంగ్వేజెస్‌, మ్యాథమెటిక్స్‌ అండ్‌ సైన్స్‌ లేదా సోషల్ స్టడీస్‌ ఉంటాయి.

అర్హత మార్కులు: ఓసీ/ఈడబ్ల్యూఎస్‌లకు 60శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు 40 శాతం. 

పరీక్ష ఫీజు: పేపర్‌1 లేదా పేపర్‌2 కు రూ.750; రెండు పేపర్లు రాస్తే రూ.1000. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఒక పేపర్‌కు రూ. 700, రెండు పేపర్లకు రూ.950

దరఖాస్తులు ప్రారంభం: 15.04.2026.

దరఖాస్తు చివరి తేదీ: 30.04.2026.

హాల్‌ టికెట్‌ డైన్‌లోడ్‌: 09.06.2026 నుంచి.

అర్హత పరీక్ష: జూన్‌ 15 నుంచి 30 వరకు.

ఫలితాలు: జులై 27 నుంచి 31 మధ్య వెల్లడిస్తారు.

Website:https://tgtet.aptonline.in/UI/HomePage/HomePage.aspx

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram