భారత స్వాతంత్య్రోద్యమంలో పురుషులతోపాటు మహిళలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడారు. ఆంగ్లేయుల అరాచకాలను ఎండగట్టడం, ప్రజలను సమీకరించడం, ధర్నాలు నిర్వహించడం, నిరసనలు చేపట్టడం లాంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తద్వారా ఉద్యమ స్ఫూర్తిని వ్యాప్తి చేయడంలో తమవంతు కృషి చేశారు. వీరు కేవలం స్వరాజ్య పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడమే కాక లింగ సమానత్వం, సామాజిక నిబంధనలు - కట్టుబాట్లను పునర్నిర్మించడంలోనూ కీలకంగా వ్యవహరించారు. దేశ చరిత్రలో స్త్రీ ఔన్నత్యాన్ని భారత స్వాతంత్య్రోద్యమం మరోసారి చాటిచెప్పింది. పోటీ పరీక్షల నేపథ్యంలో నాడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన వీరవనితల గురించి ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!
ఝాన్సీ లక్ష్మీబాయి: డల్హౌసీ ప్రకటించిన రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని అమలుపరిచిన బ్రిటిషర్లు ఈమె దత్తపుత్రుడు దామోదరరావును సంస్థానాధీశుడిగా అంగీకరించకుండా ఝాన్సీ రాజ్యాన్ని ఆక్రమించారు. దాంతో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నారు. 1858, జూన్‌లో జరిగిన గ్వాలియర్ యుద్ధంలో పాల్గొని బ్రిటిష్ దళాలతో వీరోచితంగా పోరాడారు. అదే యుద్ధంలో వీరమరణం పొందారు.
సావిత్రిబాయి ఫూలే: ప్రముఖ సంఘసంస్కర్త జ్యోతిరావు ఫూలే భార్య. లింగవివక్షకు వ్యతిరేకంగా కులరహిత సమాజం, సార్వత్రిక విద్య కోసం ఈ దంపతులు అవిశ్రాంత పోరాటం చేశారు. భర్తతో కలిసి 1848 పుణెలో బాలికల పాఠశాలను స్థాపించారు.
అనిబిసెంట్ (1847 - 1933): ఈమె ఐర్లాండ్‌కు చెందినవారు. దివ్యజ్ఞాన సమాజ సేవ కోసం భారతదేశానికి వచ్చారు. 1914లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. 1916, సెప్టెంబరులో హోమ్‌రూల్ లీగ్ స్థాపించి, స్వపరిపాలనను డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమం నడిపారు. ఈ ఉద్యమ ప్రచారానికి ‘కామన్ వీల్’, ‘న్యూ ఇండియా’ అనే పత్రికలు స్థాపించారు.
మాతంగిని హజ్రా (1870 - 1942): గాంధీజీ పిలుపు మేరకు, 1932లో బెంగాల్‌లోని మేధినీపుర్ జిల్లాలో శాసనోల్లంఘన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. తూములూక్ (toomluk) కోర్టు భవనంపై జాతీయ జెండా ఎగరవేయడానికి ప్రయత్నించడంతో బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది.
మేడం బికాజీ కామా (1861 - 1936): దాదాభాయ్ నౌరోజీ, శ్యాంజీ కృష్ణవర్మల నుంచి ప్రేరణ పొంది స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. ప్లేగు వ్యాధి బారినపడి, చికిత్స కోసం లండన్ వెళ్లారు. ఎందరో విప్లవకారులకు మార్గదర్శిగా నిలిచారు. ‘ఫ్రీ ఇండియా సొసైటీ’ని స్థాపించారు.
కమలాదేవి చటోపాధ్యాయ: 1923లో గాంధీజీ పిలుపుమేరకు సహాయ నిరాకరణ ఉద్యమ సేవాదళ్ సంస్థలో పనిచేశారు. 1930లో గాంధీజీ ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1930, జనవరి 26న భారత జాతీయ పతాకాన్ని పోలీసులు అడ్డుకున్నా, ఎగురవేశారు.
సరోజినీ నాయుడు: బొంబాయి (1915), లఖ్‌నవూ (1916) కాంగ్రెస్ మహాసభల్లో పాల్గొన్నారు. 1925, డిసెంబరులో కాన్పూర్‌లో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళగా నిలిచారు.
రాణి గైడిన్లు: మణిపుర్‌కు చెందిన ఈమె ఈశాన్య రాష్ట్రాల్లో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్న ఈమెను బ్రిటిష్ ప్రభుత్వం 1932లో జైలుకు పంపింది.
ఉషా మెహతా: క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీతో సహా ప్రముఖ నాయకులను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆ సమయంలో ఉషా మెహతా బొంబాయిలో రహస్య రేడియో ప్రసారాలతో ఉద్యమకారులను చైతన్యపరిచారు.
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన వీరవనితల గురించి పూర్తి సమాచారం ఈబుక్ రూపంలో ఈనాడు ఈప్రతిభ వాట్సాప్ ఛానెల్‌లో అందుబాటులో ఉంది. వెంటనే ఫాలో చేసి, పోటీ పరీక్షలకు ఉపయోగపడే సమాచారాన్ని ప్రతి రోజూ ఉచితంగా అందుకోండి. https://hov.to/e05e8f1a
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
ప్రశ్న: కింది ఏ రంగంలో చేసిన కృషికి సావిత్రీబాయి ఫూలే పేరు పొందారు?
(యూజీసీ నెట్ పేపర్ 2, 2019)
1) షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతి 2) పేదల అభ్యున్నతి
3) మహిళల విద్య 4) మురికివాడల పిల్లల విద్య
సమాధానం: 3
ప్రశ్న: న్యూ ఇండియా గ్రంథ రచయిత ఎవరు?
(ఆర్‌ఆర్‌బీ గ్రూప్ - డి, 2018)
1) మదర్ థెరిస్సా 2) మహాత్మా గాంధీ
3) అనిబిసెంట్ 4) జవహర్‌లాల్ నెహ్రూ
సమాధానం: 3
Q: What was the fate of Rani Lakshmibai of Jhansi after the Battle of Gwalior in 1858?
(RPF Constable 2025)
1) She was captured and executed.
2) She became the ruler of Gwalior.
3) She died fighting in battle.
4) She was exiled to Britain
Ans: 3
Link copied to clipboard!
ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు
ఎయిమ్స్ దిల్లీలో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాలు
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అండ్ ఐఎఫ్ ఎస్ నోటిషికేషన్స్- 2026
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ ఖాళీలు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ ఉద్యోగాలు
టిస్‌లో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు
చెన్నై హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు
టీహెచ్ఎస్టీఐ-బీఆర్‌ఐసీలో ఉద్యోగాలు
ఎన్ఐటీ జలంధర్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
మోర్ముగావ్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు
నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ) 2026
ఏపీ ఈఏపీసెట్-2026
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-2026 సెషన్-2
ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు
ఏపీ ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలు
విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంబీఏ ప్రవేశాలు
డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులం బీఆర్ఏజీ సెట్ 2026
తెలుగు వర్సిటీలో పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ప్రవేశాలు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్-2026 ప్రవేశాలు
సిపెట్ అడ్మిషన్ టెస్ట్-2025
స్టాల్వార్ట్ పీపుల్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
రాగ్ డిజైన్ స్టూడియో కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
ఇండికా ఏఐ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డ్యూటీపర్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
క్వాంటం ఐటీ ఇన్నోవేషన్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
సన్ ఇండియా ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ కంపెనీలో పోస్టులు
సెపాయింట్ కంపెనీలో ఇంటర్నషిప్ పోస్టులు
డెక్కన్ ఫౌండర్స్ మీడియా కంపెనీలో ఉద్యోగాలు
డీప్‌థాట్ కల్చర్‌టెక్ వెంచర్స్ కంపెనీలో పోస్టులు
లీగలిటీ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
ఈఎస్ఐసీ జైపుర్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఐఐటీ దిల్లీలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు
సీఏబీఎస్ బెంగళూరులో జేఆర్ఎఫ్ ఉద్యోగాలు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో ఉద్యోగాలు
ఐఏఆర్ఐలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీ రుద్రపుర్‌లో 42 సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
డీఆర్డీఓ ఎన్ఎస్టీఎల్, విశాఖపట్నంలో జేఆర్ఎఫ్ ఉద్యోగాలు
ఎన్పీఎల్లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
సీసీఆర్‌హెచ్‌లో ఉద్యోగాలు
ఐఆర్సీటీసీ, వెస్ట్ జోన్లో హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులు
జపాన్ పార్లమెంటరీ ఎన్నికలు
ఐరాస సాధారణ బడ్జెట్‌కు రూ.317 కోట్లు
బ్రిటన్‌లో ఎఫ్‌బీఐ తరహా పోలీసు విభాగం
డబ్ల్యూహెచ్‌వో నుంచి వైదొలిగిన అమెరికా
‘గాజా పీస్ బోర్డు’
నైజీరియాలో ఆకలి కేకలు
చైనాలో మళ్లీ తగ్గిన జనాభా
ఉగాండా అధ్యక్షునిగా ఏడోసారి ముసెవేని గెలుపు
ట్రంప్ ఛైర్మన్‌గా గాజా శాంతి మండలి
75 దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్ నిలిపివేత
ఆసియా షూటింగ్ (రైఫిల్/ పిస్టల్) ఛాంపియన్షిప్
వింటర్ ఒలింపిక్స్
అండర్-19 ప్రపంచ కప్
డబ్ల్యూపీఎల్ విజేత ఆర్సీబీ
ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్
ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్
హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అమర్నాథ్
ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత అల్కరాస్
ఆస్ట్రేలియన్ ఓపెన్
ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్
2025-26 ఆర్థిక సర్వే
బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్
‘ఏఐ ఎడ్జ్ ఫర్ వికసిత్ భారత్’
ఆర్బీఐ నివేదిక
‘రోడ్‌మ్యాప్ టు 100 గి.వా. హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ బై 2035-36’ నివేదిక
టామ్‌టామ్ ట్రాఫిక్ సూచీ
‘ఐటీ సర్వీసెస్ 25 (2026)’ నివేదిక
ఆక్స్‌ఫాం నివేదిక
ఎస్బీఐ రిసెర్చ్ నివేదిక
సియామ్ నివేదిక