రాజకీయ పార్టీలు 

రాజకీయ పార్టీలు 

ప్రజాస్వామ్య ప్రక్రియలో రాజకీయ పార్టీలు అత్యంత కీలకమైనవి. ఇవి ప్రజలను ప్రజాస్వామ్యంలో భాగస్వాములను చేయడంతోపాటు రాజకీయ చైతన్యం కలిగించి, ఎన్నికల ప్రక్రియను సులభతరం చేస్తాయి. విభిన్న భావజాలాలు, ఆసక్తులు, ప్రజల ఆకాంక్షలకు ఇవి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఓటర్లను సమీకరించడం, విధానాలు రూపొందించడం, ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా పనిచేసేలా చూడటంలో రాజకీయ పార్టీలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. పోటీ పరీక్షల నేపథ్యంలో రాజకీయ పార్టీల గురించి ముఖ్య సమాచారం తెలుసుకుందాం..!

రాజకీయ పార్టీ అంటే?

  • జాతి ప్రయోజనాలను పెంపొందించే లక్ష్యంతో ఒకే రకమైన రాజకీయ దృక్పథాలు కలిగి, రాజ్యాంగబద్ధంగా అధికారాన్ని సాధించేందుకు కృషి చేసే కొంతమంది వ్యక్తుల సముదాయాన్ని రాజకీయ పార్టీగా పేర్కొంటారు. 
  • మన దేశంలో రాజకీయ పార్టీలు రాజ్యంగబద్ధమైనవి కావు. రాజ్యాంగంలోని 3వ భాగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్‌ 19(1)(C) ప్రకారం.. సంఘాలు లేదా అసోసియేషన్లు అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని పౌరులు రాజకీయ పార్టీలను స్థాపించుకోవచ్చు.

గుర్తింపు ఇలా..

  • భారత ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్‌ 29(A) ప్రకారం భారత ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు గుర్తింపు ఇస్తుంది. ఎన్నికల గుర్తులను కేటాయిస్తుంది. రాజకీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కనీసం 100 మంది ఓటర్ల సంతకాల మద్దతు ఉండాలి. దీంతోపాటు రూ.10,000 డిపాజిట్‌గా చెల్లించి కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రాజకీయ పార్టీగా నమోదు చేసుకోవాలి. 

వర్గీకరణ

  • భారతదేశంలో రాజకీయ పార్టీలను జాతీయ, రాష్ట్ర/ ప్రాంతీయ, రిజిస్టర్డ్‌ పార్టీలుగా వర్గీకరించారు. 

జాతీయ పార్టీలు: ఎన్నికల సంఘం ప్రకారం 2026, జనవరి 22నాటికి దేశంలో 6 జాతీయ పార్టీలు ఉన్నాయి. 

రాష్ట్ర/ ప్రాంతీయ పార్టీలు: 2026, జనవరి 22 నాటికి మన దేశంలో 67 రాష్ట్రీయ పార్టీలు ఉన్నాయి. 

రిజిస్టర్డ్‌ పార్టీలు: జాతీయ పార్టీ లేదా రాష్ట్ర/ ప్రాంతీయ పార్టీ హోదా లేని వాటిని రిజిస్టర్డ్‌ పార్టీలు అంటారు. కేంద్ర ఎన్నికల సంఘం వీటికీ ఎన్నికల గుర్తింపు చిహ్నాలు కేటాయిస్తుంది.  2025, జూన్‌లో భారత ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం  దేశంలో 2,046 రిజిస్టర్డ్‌ పార్టీలు ఉన్నాయి.

గుర్తింపు తొలగింపు..

  • రాజకీయ పార్టీల నమోదుకు సంబంధించిన మార్గదర్శకాల ప్రకారం, ఒక పార్టీ వరుసగా ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకపోతే దాన్ని నమోదిత పార్టీల జాబితా నుంచి తొలగిస్తారు
  • 2025 ఆగస్టు, సెప్టెంబరులో ఎన్నికల కమిషన్‌ దేశవ్యాప్తంగా 808 పార్టీలను రద్దు చేసింది. ఈ పార్టీలేవీ రిజిస్టర్డ్‌ అడ్రస్‌లో లేకపోవడం, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకపోవడంతో వీటిని నమోదిత రాజకీయ పార్టీల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్, 2019)

Q: బహుజన్‌ సమాజ్‌ పార్టీ వ్యవస్థాపకులు ఎవరు?

1) దేవీలాల్‌        2) మున్షీరాం

3) లక్ష్మణ్‌ సింగ్‌     4) కాన్షీరాం

సమాధానం: 4

(మహారాష్ట్ర పోలీస్‌ కానిస్టేబుల్, 2017)

Q: రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధిత రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో సాధించాల్సిన నిబంధనను గుర్తించండి. 

1) ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో కనీసం 6% ఓట్లు, 2 సీట్లు సాధించాలి. 

2) పోలైన మొత్తం ఓట్లలో కనీసం 4% ఓట్లు, 4 సీట్లు సాధించాలి. 

3) పోలైన మొత్తం ఓట్లలో కనీసం 6% ఓట్లు, 3 సీట్లు సాధించాలి. 

4) పోలైన మొత్తం ఓట్లలో కనీసం 4% ఓట్లు, 2 సీట్లు సాధించాలి.

సమాధానం: 1

(Bihar STET PGT (Political Science) Official Paper-II, 2023)

Q: How many national parties are there in India?
1) 6            2) 8            3) 10          4) 9
Answer: 1
 
(SSC GD, 2019)

Q: The Elephant is a symbol of which Indian political party?
1) National Congress Party
2) Communist Party of India
3) Bahujan Samaj Party
4) Rashtriya Janata Dal
Answer: 3 

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram