ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అనేక సంస్కృతులు, సంప్రదాయాలను పాటిస్తారు. తరాలు మారినా వాటిని అనుసరిస్తూ తమ జీవితంలో భాగంగా చేసుకుంటారు. ఇవి ఆ ప్రాంత విశిష్టతను ప్రతిబింబిస్తాయి. అవన్నీ అవ్యక్తమైనవి (ఇన్‌టాంజిబుల్). అంటే కళాఖండాలు, పాత భవనాల్లాగా వీటిని తాకుతూ అనుభూతి చెందలేం. అయినప్పటికీ సంస్కృతులు ప్రజల జీవనశైలితో ముడిపడి ఉంటాయి. ఉదాహరణకు మన దేశంలో నవరాత్రి సమయంలో గుజరాత్‌లో ‘గర్బా’ అనే జానపద నృత్యం, జ్ఞానాన్ని - మానసిక ఉల్లాసాన్ని కలిగించే యోగా లాంటి అభ్యాసాలు, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే దీపావళి లాంటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ సామాజిక బంధాలను బలోపేతం చేస్తాయి. ప్రజలందరినీ ఏకతాటిపైకి తెస్తాయి. ఇలాంటి అవ్యక్త సాంస్కృతిక వారసత్వాన్ని (Intangible Cultural Heritage - ICH) కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉంది. ఈ ఉద్దేశంలో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు తన వంతు కృషి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆయా సంస్కృతులకు వారసత్వ గుర్తింపు ఇస్తోంది.
అవ్యక్త సాంస్కృతిక వారసత్వం అంటే?
ఐసీహెచ్ జాబితా ఏర్పాటు ఇలా..
ఐసీహెచ్ మొత్తం అయిదు విస్తృత రంగాల్లో వ్యక్తమవుతుంది. అవి:
1. మౌఖిక సంప్రదాయాలు, వ్యక్తీకరణలు; అవ్యక్త సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే భాష (Oral traditions and expressions, including language as a vehicle of the intangible cultural heritage.)
2. ప్రదర్శన కళలు (Performing arts)
3. సామాజిక పద్ధతులు, ఆచారాలు, పండుగ కార్యక్రమాలు (Social practices, rituals and festive events)
4. ప్రకృతి, విశ్వాసానికి సంబంధించిన జ్ఞానం, అభ్యాసాలు (Knowledge and practices concerning nature and the universe)
5. సంప్రదాయ చేతి వృత్తులు (Traditional craftsmanship)
2025 సమావేశం భారత్‌లో..
భారత్‌లో యునెస్కో గుర్తింపు పొందిన ఐసీహెచ్ జాబితా
| ఐసీహెచ్ అంశం | గుర్తింపు పొందిన సంవత్సరం | చెందిన రాష్ట్రం/ ప్రాంతం |
| వేద పఠన సంప్రదాయం | 2008 | దేశవ్యాప్తంగా |
| రామ్‌లీల - రాయాయణం సంప్రదాయ ప్రదర్శన | 2008 | ఉత్తర్ ప్రదేశ్ |
| కుటియట్టం, సంస్కృత నాటకరంగం | 2008 | కేరళ |
| రమ్మన్, గర్వాల్ హిమాలయాల మతపరమైన పండుగ | 2009 | ఉత్తరాఖండ్ (గర్వాల్) |
| మెడియెట్టు, రిచ్యువల్ థియేటర్, కేరళ నృత్య నాటకం | 2010 | కేరళ |
| కల్బేలియా జానపద గీతాలు, నృత్యాలు | 2010 | రాజస్థాన్ |
| ఛౌ నృత్యం | 2010 | ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ |
| బౌద్ధ మత ప్రార్థనలు, బౌద్ధ గ్రంథాల పఠనం | 2012 | లద్దాఖ్ |
| మణిపుర్‌కి చెందిన సంకీర్తన, ఆచారబద్ధమైన గానం, డ్రమ్ వాయించడం, నృత్యం | 2013 | మణిపుర్ |
| జండియాల గురు - తథేరాల వంశానికి చెందిన సంప్రదాయ ఇత్తడి, రాగి పాత్రల తయారీ | 2014 | పంజాబ్ |
| యోగా | 2016 | దేశవ్యాప్తంగా |
| కుంభమేళా | 2017 | ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర |
| కోల్‌కతాలో జరిపే దుర్గా పూజ | 2021 | పశ్చిమ బెంగాల్ |
| గర్బా జానపద నృత్యం | 2023 | గుజరాత్ |
| నౌరుజ్ | 2024 | దేశ, అంతర్జాతీయవ్యాప్తంగా |
| దీపావళి | 2025 | దేశవ్యాప్తంగా |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
ప్రశ్న: యునెస్కో కింది ఏ సంవత్సరంలో దుర్గా పూజను ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్‌గా గుర్తించింది? (ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్, 2025)
1) 2023 2) 2015
3) 2019 4) 2021
సమాధానం: 4
Q: In 2023, 'Garba' was declared as an intangible cultural heritage by UNESCO. Which of the following states is Garba from? (RRB ALP CBT-I 2024)
1) Assam
2) Kerala
3) West Bengal
4) Gujarat
Answer: 4
Q: In which year did UNESCO include Yoga in its Intangible Cultural Heritage list? (SSC CHSL 2020)
1) 2016
2) 2014
3) 2018
4) 2015
Answer: 1