విక్రం సారాభాయ్‌తో కలిసి భారత అంతరిక్ష కార్యక్రమానికి పునాది వేసిన ప్రముఖ శాస్త్రవేత్త ఏక్‌నాథ్ వసంత్ చిట్నిస్(100) మహారాష్ట్రలోని పుణెలో 2025, అక్టోబరు 22న మరణించారు. కేరళలోని తుంబాలో భారత మొట్టమొదటి రాకెట్ ప్రయోగానికి స్థల ఎంపికలో చిట్నిస్ కీలక పాత్ర పోషించారు. 1962 ఫిబ్రవరిలో నాటి ప్రధాని నెహ్రూ, సారాభాయ్, చిట్నిస్‌ల మధ్య జరిగిన చర్చ భారత అంతరిక్ష కార్యక్రమానికి నాంది పలికింది. ఆ భేటీ జరిగిన కొన్ని రోజులకు ‘ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్’ను ఏర్పాటు చేశారు.
1925, జులై 25న కొల్హాపుర్‌లో జన్మించిన చిట్నిస్ ఉన్నత విద్యను పుణెలో పూర్తిచేశారు.