వైరస్, బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవుల ద్వారా సంక్రమించే వ్యాధుల నుంచి మానవ శరీరాన్ని రక్షించే జీవ సంబంధ ఉత్పత్తులే టీకాలు (వ్యాక్సిన్లు). ఇవి దేహంలో రోగ నిరోధకతను పెంపొందించి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా చేస్తాయి. అంటువ్యాధుల నుంచి కాపాడతాయి. తీవ్రమైన వ్యాధులను నివారించే శక్తిమంతమైన సాధనంలా పనిచేస్తాయి. టీకాల ప్రాముఖ్యం గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా మార్చి 16న ‘జాతీయ టీకా దినోత్సవం’గా (National Vaccination Day) నిర్వహిస్తారు. దీన్నే ‘జాతీయ రోగనిరోధక దినోత్సవం’ (National Immunization Day) అని కూడా అంటారు. మెరుగైన ప్రజారోగ్యం, దీర్ఘాయుష్షు, శక్తిమంతమైన సమాజ నిర్మాణంలో వ్యాక్సిన్లు ఏ విధంగా దోహదం చేస్తాయో చాటడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
వ్యాక్సిన్లు అంటే?
ఇలా పనిచేస్తాయి..
చారిత్రక నేపథ్యం
ప్రపంచవ్యాప్తంగా పోలియోను నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) 1988లో మొదటిసారి ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం 1995, మార్చి 16న దేశంలో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి ఏటా ఇదే తేదీన జాతీయ టీకా దినోత్సవాన్ని జరుపుతున్నారు.
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. భారతదేశంలో కింది ఏ తేదీన జాతీయ టీకా దినోత్సవాన్ని జరుపుతున్నారు?
(ఎన్‌హెచ్‌ఎం ఎంపీ సీహెచ్‌ఓ, 2021),(డబ్ల్యూబీసీఎస్ మెయిన్స్, 2021)
1) మార్చి 12 2) మార్చి 18
3) మార్చి 16 4) మార్చి 25
సమాధానం: 3
2. మశూచి వ్యాక్సిన్‌ను ఎవరు కనుక్కున్నారు?
(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2020), (రాజస్థాన్ పోలీస్ కానిస్టేబుల్, 2020),
(ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్, 2018), (ఎంపీ పోలీస్ కానిస్టేబుల్, 2023)
1) జోనాస్ సాల్క్ 2) లూయిస్ పాశ్చర్
3) ఎడ్వర్డ్ జెన్నర్ 4) లియోన్ కాల్మెట్
సమాధానం: 3
3. న్యుమోకాకల్ వ్యాక్సిన్ (Pneumococcal) అనేది?
(ఎన్‌హెచ్‌ఎం ఎంపీ సీహెచ్‌ఓ, 2023)
1) సబ్‌యూనిట్ వ్యాక్సిన్ 2) ప్రోటీన్ వ్యాక్సిన్
3) కాంజుగేటెడ్ వ్యాక్సిన్ 4) రీకాంబినెంట్ ప్రోటీన్ వ్యాక్సిన్
సమాధానం: 3
4. When is National Vaccination Day observed in India?
(RBI Office Attendant, 2021)
1) 14 March 2) 15 March 3) 16 March
4) 17 March 5) 18 March
Ans: 3
5. In March 2025, which health milestone was remembered on National Vaccination Day?
(RRB NTPC Graduate Level, 2025)
1) Launch of COVID Vaccine 2) National Vax Mission
3) Pulse Polio First Dose 4) Polio Eradication Drive
Ans: 3