ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

వివిధ ఉత్పత్తులు, వస్తువులు, సేవలు కొనుగోలు చేసే ప్రతి వ్యక్తికి వాటి నాణ్యత, స్వచ్ఛత, ప్రమాణాల గురించి సమాచారం పొందే హక్కు ఉంటుంది. దీన్నే వినియోగదారుల హక్కు అంటారు. చాలా మందికి దీనిపై అవగాహన లేక నకిలీ వస్తు, సేవల వల్ల మోసపోవడమో లేదా అన్యాయానికి గురవడమో జరుగుతోంది. అన్యాయమైన పద్ధతులు, వివక్ష, దోపిడీకి గురికాకుండా వినియోగదారులను రక్షించే లక్ష్యంతో ఏటా మార్చి 15న ‘ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం’గా (World Consumer Rights Day) నిర్వహిస్తారు. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటంతోపాటు వారి రక్షణ, సాధికారత, హక్కులపై అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

వినియోగదారుడు అంటే?

  • వ్యక్తిగత ఉపయోగం కోసం డబ్బు చెల్లించడం ద్వారా ఏవైనా వస్తువులు లేదా సేవలు పొందే వ్యక్తిని వినియోగదారుడు అంటారు. వీరే ఆ వస్తు లేదా సేవలకు అంతిమ కొనుగోలుదారు అవుతారు. వినియోగదారు వ్యక్తుల సమూహం కూడా కావొచ్చు.
  • వీరికి తాము కొన్న వస్తు, సేవల నాణ్యత, స్వచ్ఛత, ధర, ప్రమాణాల గురించి తెలుసుకునే హక్కు ఉంటుంది. వీటిలో ఏది లోపించినా వారు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేయొచ్చు. 

వినియోగదారుల రక్షణ చట్టం, 2019

భారతదేశంలో వినియోగదారుల ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో 1986లో వినియోగదారుల రక్షణ చట్టం చేశారు. వివాదాల పరిష్కారానికి వినియోగదారుల మండళ్లు, ఇతర అధికారులను ఏర్పాటు చేయడం దీని ముఖ్య ఉద్దేశం. దీన్ని మరింత మెరుగుపరిచి వినియోగదారుల రక్షణ చట్టం, 2019 తెచ్చారు. పారదర్శకత, జవాబుదారీతనానికి ఇందులో పెద్దపీట వేశారు. వినియోగదారుల సాధికారతకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ చట్టంలోని నిబంధనలు 2020, జులై 20 నుంచి అమల్లోకి వచ్చాయి.

దేశంలో వినియోగదారు ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ

భారత్‌లో వినియోగదారుల వివాదాలను పరిష్కరించడానికి ఒక నిర్మాణాత్మక వ్యవస్థ ఉంది. ఇందులో మూడు స్థాయులు ఉన్నాయి. ఇవి వినియోగదారుల రక్షణ చట్టం, 1986 ద్వారా ఏర్పాటయ్యాయి.

1. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ (ఎన్‌సీడీఆర్‌సీ):  వినియోగదారుల వివాదాలకు చవకైన, వేగవంతమైన పరిష్కారాన్ని అందించడం దీని ముఖ్య ఉద్దేశం. 

  • ఇది రూ.2 కోట్ల కంటే ఎక్కువ విలువైన వస్తు, సేవలకు సంబంధించిన ఫిర్యాదును స్వీకరించే అధికార పరిధిని కలిగి ఉంది.
  • రాష్ట్ర, జిల్లా కమిషన్లు తీసుకునే నిర్ణయాలకు అప్పిలేట్‌ అథారిటీగా వ్యవహరిస్తుంది.

2. రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ (స్టేట్‌ కమిషన్‌):

  • రూ. 50 లక్షల నుంచి రూ.2 కోట్ల మధ్య విలువైన వస్తు, సేవలకు సంబంధించిన ఫిర్యాదులను నిర్వహిస్తుంది.  

3. జిల్లా వినియోగదారుల వివాదాల కమిషన్‌ (జిల్లా కమిషన్‌):

  • వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన క్వాసీ-జ్యుడీషియల్‌ సంస్థ.

చారిత్రక నేపథ్యం

1962, మార్చి 15న నాటి అమెరికా అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెన్నడీ యూఎస్‌ కాంగ్రెస్‌లో వినియోగదారుల హక్కుల సమస్యలపై కీలక ప్రసంగం చేశారు. ఈ స్ఫూర్తితో మొదటి ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని 1983లో నిర్వహించారు. అప్పటి నుంచి కన్‌స్యూమర్స్‌ ఇంటర్నేషనల్‌ అనే సంస్థ దీన్ని అధికారికంగా జరుపుతోంది.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన జరుపుకుంటారు?

(45వ బీపీఎస్సీ ప్రిలిమ్స్, 2002),(యూపీఎస్‌ఎస్‌ఎస్‌సీ పీఈటీ, 2025)

1) మార్చి 13           2) మార్చి 14

3) మార్చి 15              4) మార్చి 16

సమాధానం: 3

2. కిందివాటిలో ఏది వినియోగదారుడి హక్కు?

(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2020)

1) వస్తువులను అమ్మే హక్కు        2) వస్తువులను ఉత్పత్తి చేసే హక్కు

3) పరిహారం కోరే హక్కు        4) రాజ్యాంగ పరిహారాల హక్కు

సమాధానం: 3

3. ______ is a mandatory mark found on all processed fruit products sold in India - such as packaged fruit beverages, fruit-jams, crushes and squashes, pickles, dehydrated fruit products, and fruit extracts - as per the Food Safety and Standards Act of 2006.
(SSC CPO, 2020)
1) FPO                2) BEE Star Rating
3) HALLMARK        4) ISI
Ans: 1
4. The rights of consumers under which information is displayed on the packaging by the manufacturer of goods and services are-
(Bihar Police SI, 2023)
1) Right to Information        2) Right to choose
3) Right to redress            4) Right to representation
Ans: 1 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram