గణితం అంటే కేవలం మార్కుల కోసం అభ్యాసం చేసే సబ్జెక్ట్ కాదు. ఇది చాలా విస్తృతమైంది. మానవ జీవితంలోని ప్రతి అంశం మ్యాథ్స్‌తో ముడిపడి ఉంటుంది. రోజువారీ జీవితంలో ఆర్థిక నిర్వహణ, కార్యాచరణ, సమస్య పరిష్కారం, తార్కిక ఆలోచన మెరుగుపరచుకోవడం లాంటి అనేక విషయాలు దీని ద్వారానే జరుగుతాయి. ప్రకృతిలో మనం చూసే ప్రతి వస్తువూ ఒక లెక్క, కొలత, పెరుగుదలను పాటిస్తూ ఉంటాయి. ఇవన్నీ గణితశాస్త్రంలో భాగాలే. ఇది మనకు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి సాయం చేయడమే కాక, చట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించడంలో ఉపయోగపడుతుంది. విద్యార్థిగా దీన్ని నేర్చుకోవడం ఎంతో ఆసక్తికరంగా, సవాలుతో కూడి ఉంటుంది. విద్యారంగంలో, నిత్య జీవితంలో గణితం పోషించే పాత్రతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఆర్థికశాస్త్రం లాంటి వివిధ రంగాల్లో మ్యాథ్స్ ఉపయోగాల గురించి ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో ఏటా మార్చి 14న ‘అంతర్జాతీయ గణిత దినోత్సవం’గా (International Day of Mathematics) నిర్వహిస్తారు. దీన్నే ‘పై డే’ ( Pi Day) అని కూడా అంటారు. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో గణితశాస్త్రం పోషించే ప్రాథమిక పాత్రను తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
గణితం అంటే..?
‘పై (π)’ గురించి
చారిత్రక నేపథ్యం
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
Q: భారతదేశంలో ‘పై (π)’ విలువను మొదటిసారి లెక్కించింది? (ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2019)
1) బుధాయన 2) ఆర్యభట్ట
3) భాస్కరాచార్య 4) శ్రీధరాచార్య
సమాధానం: 2
Q: పై విలువను మొదట ఎవరు లెక్కించారు? (యూపీఎస్సీ కంబైన్డ్ స్టేట్ ఎగ్జామ్, 2024)
1) ఆర్యభట్ట 2) థేల్స్
3) పైథాగరస్ 4) ఆర్కిమెడిస్
సమాధానం: 4
Q: అంతర్జాతీయ గణిత దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ జేఎల్‌ఎం, 2019)
1) మార్చి 14 2) నవంబరు 15
3) సెప్టెంబరు 9 4) ఆగస్టు 21
సమాధానం: 1
Q. Who invented zero in ancient mathematics? (MP Patwari, 2023), (ACC 121 CGAT, 2019)
1) Ban Bhatta
2) Arya Bhatta
3) Sushruta
4) Newton
Answer: 2
Q. When is National Mathematics Day celebrated every year? (MP Patwari, 2023), (Tripura TET 2016)
1) 21 December
2) 22 December
3) 23 December
4) 24 December
Answer: 2