ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవం

ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవం

ప్రజా జీవనానికి తీవ్ర నష్టం కలిగించే పరిస్థితినే విపత్తు అంటారు. ప్రకృతి వైపరీత్యాలతోపాటు మానవ చర్యల ఫలితంగా ఇవి సంభవిస్తాయి. వీటి కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగుతాయి. మన దేశంలోనూ అనేక ప్రాంతాలు విపత్తులను ఎదుర్కొంటున్నాయి. అలాంటి దుర్భల పరిస్థితుల్లో బాధితులకు సహాయ సహకారాలు అందించడానికి ఏర్పాటైన ప్రత్యేక దళమే ‘నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌)’. ఇది దేశంలో సంభవించే విపత్తులను నిర్వహించడంలో, విపత్తు ప్రమాద తగ్గింపు (Disaster Risk Reduction) గురించి అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని స్థాపనకు గుర్తుగా ఏటా జనవరి 19న ‘ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవం’గా (NDRF Raising Day) నిర్వహిస్తారు. వైపరీత్యాల సమయంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది చూపే తెగువ, ధైర్యాన్ని గౌరవించడంతోపాటు వారి సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. 

దేశంలో విపత్తు నిర్వహణ - నిర్మాణం

  • భారతదేశంలో 1900, 1905, 1907లో వరసగా కరవులు సంభవించాయి. 1937లో బిహార్‌-నేపాల్‌ సరిహద్దుల్లో భూకంపం వచ్చింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకున్న బ్రిటిష్‌ ప్రభుత్వం విపత్తు నిర్వహణ కోసం ఒక నిర్దిష్టమైన వ్యవస్థాగత నిర్మాణం ఉండాలని భావించింది. దీనికి అనుగుణంగా 1937లో మొదటిసారి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకునే వ్యవస్థను ఏర్పాటు చేసింది. స్వాతంత్య్రానంతరం కూడా ఇదే వ్యవస్థను కొనసాగించారు.
  • ఐక్యరాజ్యసమితి 1990 దశాబ్దాన్ని ‘అంతర్జాతీయ విపత్తు తగ్గింపు దశాబ్దం’గా ప్రకటించింది. దీంతో మన దేశంలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ విభాగాన్ని ఏర్పాటు చేశారు.
  • దేశంలో సమగ్ర జాతీయ విపత్తు నిర్వహణ విధానాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం 1999, అక్టోబరులో కేంద్ర వ్యవసాయశాఖ మాజీ కార్యదర్శి జేసీ పంత్‌ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. దీని సూచనల మేరకు 2002లో విపత్తు నిర్వహణ విభాగాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోకి మార్చారు. కరవు నిర్వహణ (వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది) మినహా మిగతా అన్ని విపత్తుల నిర్వహణను హోంమంత్రి శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. 

నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌)

  • విపత్తుల సమయంలో అభివృద్ధి చెందిన దేశాల్లో అనుసరిస్తోన్న కార్యక్రమాలు, ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం 2005, డిసెంబరు 23న ‘జాతీయ విపత్తు నిర్వహణ చట్టం’ తీసుకొచ్చింది.  
  • ఈ చట్టం ద్వారా నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) ఏర్పడింది. ప్రకృతి, మానవ కారక విపత్తుల సమయంలో ప్రత్యేక ప్రతిస్పందన వ్యవస్థగా ఇది వ్యవహరిస్తుంది. ఇది కేంద్ర హోం మంత్రిత్వశాఖ అధీనంలో పనిచేస్తుంది. 

విధులు

  • వరదలు, భూకంపాలు, తుపానులు, రసాయన/ జీవ సంబంధ దుర్ఘటనలు లాంటి ప్రకృతి, మానవకారక విపత్తుల సమయంలో వేగవంతమైన శోధన, రక్షణ, ఉపశమనం (search, rescue, and relief) ద్వారా ప్రాణ నష్ట నివారణపై ఎక్కువగా దృష్టి సారిస్తుంది. 
  • విపత్తు నిర్వహణ ప్రణాళికలను రూపొందించడం ద్వారా సురక్షిత, మరింత స్థితిస్థాపక భారతదేశాన్ని సృష్టించడం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ప్రధాన లక్ష్యం.
  • వైపరీత్యాల సమయంలో తక్షణ వైద్య సాయం, తరలింపు కార్యక్రమాలు చేపట్టడం.
  • స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్సెస్‌ (ఎస్‌డీఆర్‌ఎఫ్‌), కమ్యూనిటీ వాలంటీర్లకు విపత్తు నిర్వహణ శిక్షణ అందించడం.
  • విపత్తు సంసిద్ధతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం.
  • ఐక్యరాజ్యసమితి సమన్వయంతో విదేశాల్లో మానవతా సహాయ కార్యకలాపాల్లో పాల్గొనడం. 

చారిత్రక నేపథ్యం

దేశవ్యాప్తంగా విపత్తుల నిర్వహణకు ప్రత్యేక దళం ఉండాలనే ఉద్దేశంతో విపత్తు నిర్వహణ చట్టం, 2005 ద్వారా నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) ఏర్పాటైంది. 2006, జనవరి 19న దేశానికి చెందిన ప్రాథమిక విపత్తు ప్రతిస్పందన దళంగా ఇది ఉనికిలోకి వచ్చింది. దీని ఏర్పాటును పురస్కరించుకుని 2007 నుంచి ప్రతి సంవత్సరం జనవరి 19న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవంగా జరుపుతున్నారు.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

ప్రశ్న: నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) ఎప్పుడు ఏర్పాటైంది?

(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ (యూజీ) 2025)

1) 2005    2) 2007        3) 2006    4) 2004

సమాధానం: 3

Q: Consider the following statements regarding National Disaster Responsive Force (NDRF):
1. It functions under ministry of Home Affairs.
2. It consists of both military and Para-military battalion forces.
Which of the statements given above is/are correct?
(UPSC Civil Services (Preliminary) Examination, 2018)
1) 1 only                2) 2 only
3) Both 1 and 2            4) Neither 1 nor 2
Ans: 1
Q: Which of the following is full form of NDRF?
(CSIR-CLRI JSA 2025)
1) National Disaster Reaction Force 
2) National Disaster Rescue Force
3) National Disaster Response Force
4) National Disaster Relief Force
Ans: 3

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram