అంతర్జాతీయ బయోస్పియర్‌ రిజర్వ్‌ల దినోత్సవం

అంతర్జాతీయ బయోస్పియర్‌ రిజర్వ్‌ల దినోత్సవం

పర్యావరణ పరిరక్షణలో, జీవవైవిధ్య రక్షణలో అడవుల పాత్ర కీలకం. మానవ కార్యకలాపాల ఫలితంగా వీటి విస్తీర్ణం క్రమంగా తగ్గుతోంది. దీంతో పర్యావరణ సమతౌల్యానికి విఘాతం కలుగుతోంది. అడవులు తరిగిపోవడంతో వన్యప్రాణుల జీవనానికి ముప్పు వాటిల్లుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక  మొక్కలు, జంతువులు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. వాటిని రక్షించేందుకు ఏర్పాటు చేసినవే బయోస్పియర్‌ రిజర్వ్‌లు (జీవావరణ కేంద్రాలు). వీటి గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా నవంబరు 3న ‘అంతర్జాతీయ బయోస్పియర్‌ రిజర్వ్‌ల దినోత్సవం’గా (International Day For Biosphere Reserves) నిర్వహిస్తారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో, స్థిరమైన అభివృద్ధిని సాధించడంలో జీవావరణ కేంద్రాల ప్రాముఖ్యతను చాటిచెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. 

బయోస్పియర్‌ రిజర్వ్‌లు

  • అంతరించిపోతోన్న మొక్కలు, జంతువులను వాటి భౌగోళిక ప్రాంతాల్లోనే పరిరక్షించడానికి ఏర్పాటు చేసిన ప్రాంతాలను బయోస్పియర్‌ రిజర్వ్‌లు (జీవావరణ కేంద్రాలు) అంటారు. తీరప్రాంత, సముద్ర పర్యావరణ వ్యవస్థల్లోనూ అంతరించేందుకు సిద్ధంగా ఉన్న జీవులను రక్షించడానికి వీటిని నెలకొల్పుతారు.
  • ఇవి ప్రకృతి పరిరక్షణతోపాటు ఆర్థిక - సామాజిక అభివృద్ధి, సంస్కృతుల రక్షణలోనూ కీలకంగా వ్యవహరిస్తాయి.
  • వాతావరణ మార్పులను అధ్యయనం చేయడానికి ఉపయోగపడతాయి. 
  • బయోస్పియర్‌ రిజర్వ్‌లను కేంద్ర ప్రభుత్వాలు నామినేట్‌ చేస్తాయి.  

ప్రపంచవ్యాప్తంగా ఉన్న బయోస్పియర్‌ రిజర్వ్‌లు

  • యునెస్కో ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 138 దేశాల్లో 738 బయోస్పియర్‌ రిజర్వ్‌లు ఉన్నాయి. వాటిలో 22 ట్రాన్స్‌బౌండరీ సైట్‌లు. అంటే అవి అంతర్జాతీయ సరిహద్దుల్లో విస్తరించి ఉన్నాయి. రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలకు వాటితో సంబంధం ఉంటుంది. 

చారిత్రక నేపథ్యం

  • ప్రజలకు, పర్యావరణానికి మధ్య సంబంధాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో యునెస్కో 1971, నవంబరు 3న మాన్‌ అండ్‌ ది బయోస్పియర్‌ (ఎంఏబీ) ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. 2021 నవంబరు 9 నుంచి 24 మధ్య పారిస్‌లో యునెస్కో జనరల్‌ కాన్ఫరెన్స్‌ 41వ సమావేశం జరిగింది. ఎంఏబీ ప్రోగ్రాం ప్రారంభమై 50 ఏళ్లు అయిన సందర్భంగా ఏటా నవంబరు 3న ‘అంతర్జాతీయ బయోస్పియర్‌ రిజర్వ్‌ల దినోత్సవం’గా జరుపుకోవాలని ఆ సమావేశంలో తీర్మానించారు. 2022 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు.
  • 2025 నినాదం: "Harmony with Nature and Sustainable Development" 

    భారతదేశంలోని బయోస్పియర్‌ రిజర్వ్‌ల కోసం కింది లింక్‌పై క్లిక్‌ చేయండి.

    https://courses.epratibha.net/courses/16/contents/98552/?content_detail_v2=true

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram