ప్రపంచం మునుపెన్నడూ లేనంతగా విధ్వంసానికి చేరువైందని ‘బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్’ అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. అమెరికా, రష్యా, చైనా, ఇతర దేశాలు దుందుడుకుగా వ్యవహరించడం, శత్రుభావాలు, జాతీయవాదం పెరగడం వంటివి ఇందుకు కారణమని వివరించింది. దీంతో ‘డూమ్స్‌డే గడియారం’లో అర్ధరాత్రికి 85 సెకన్ల దూరంలోనే ఉంది. వినాశనానికి మానవాళి ఎంత దూరంలో ఉందన్నది బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్ విశ్లేషిస్తుంది. ఒక ఊహాజనిత గడియారంపై అర్ధరాత్రి 12 గంటల సమయాన్ని వినాశనానికి సూచికగా అభివర్ణిస్తుంది. దీన్ని డూమ్స్‌డే క్లాక్‌గా పిలుస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఈ సమయాన్ని ముందుకు, వెనక్కి జరుపుతుంటుంది. 2025లో గడియారాన్ని అర్ధరాత్రికి 89 సెకన్లకు చేరువ చేసింది. అణ్వస్త్ర దేశాలతో ప్రమేయమున్న ఘర్షణలు పెరిగే ప్రమాదం ఉందని సంస్థ తెలిపింది.