మన దేశ బయోఎకానమీ రంగం 2030 నాటికి 300 బిలియన్ డాలర్ల (సుమారు రూ.26.40 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని నీతి ఆయోగ్ నివేదిక అంచనా వేసింది. వ్యవసాయం, అటవీ, మత్స్య సంపద, ఆక్వాకల్చర్‌లను కలుపుకుని, మన దేశంలో బయోఎకానమీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని వెల్లడించింది. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే దార్శనికతకు, వ్యవసాయ పరివర్తన కేంద్రంగా ఉందని ‘రీఇమాజినింగ్ అగ్రికల్చర్: ఎ రోడ్‌మ్యాప్ ఫర్ ఫ్రంటియర్ టెక్నాలజీ లీడ్ ట్రాన్స్‌ఫర్మేషన్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో నీతి ఆయోగ్ వివరించింది.