‘స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైజ్‌’

‘స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైజ్‌’
  • ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాముల 125వ జయంతి సందర్భంగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు 2026, మార్చి 16న ఆవిష్కరించారు. దీనికి ‘స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైజ్‌’గా పేరు పెట్టారు. 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఇనుమును వినియోగించి విగ్రహాన్ని తయారు చేశారు.
  • పొట్టి శ్రీరాములు 1901, మార్చి 16న నాటి మద్రాస్‌ ప్రెసిడెన్సీలో జన్మించారు. మద్రాస్‌ రాజధానిగా ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు వారికి సరైన గుర్తింపు ఉండేది కాదు. దీనిపై పోరాడి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షతో ప్రాణ త్యాగం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram